Site icon HashtagU Telugu

Libra: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 తుల రాశి ఫలితాలు

Libra 2023 2024

Libra 2023 2024

శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 తుల రాశి (Libra) ఫలితాలు:

చిత్త 3,4 పాదములు; స్వాతి 1,2,3,4 పాదములు; విశా 1,2,3 పాదములు ఈ తుల రాశి (Libra) కిందకి వస్తాయి.

ఆదాయం :- 14, వ్యయం :- 11,
రాజపూజ్యం :- 7, అవమానం :-  7.

ఈ సంవత్సరం ఈ రాశి వారికి యోగదాయకముగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారముతో కుటుంబ ఆర్ధిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రారంభించిన కార్యములు సంవత్సర ద్వితీయార్ధమున పూర్తి అవుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధనధాన్యవృద్ధి ఉంటుంది. విద్యార్ధులు మంచి ఫలితములను పొందుతారు. వ్యవసాయదారులు సామాన్య ఫలితములు పొందుతారు. కోర్టు వ్యవహారములు స్నేహితుల సహకారంతో పరిష్కరించుకుంటారు. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయుటచే ప్రజల నుండి మద్దతు లభిస్తుంది.

ఉద్యోగము శుభ నందు పదోన్నతి లభిస్తుంది. గృహమున శుభ కార్యప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలెను. వస్త్ర వ్యాపారస్తులు కొత్త పెట్టుడుల ద్వారా అధిక లాభాలను పొందుతారు. ఆరోగ్యము విషయంలో శ్రద్ధ వహించాలి. విద్యార్థులు ఉన్నత విద్య కొరకు విదేశములకు వెళ్ళుదురు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవసరమైన ధనం సంపాదిస్తారు. సినీ రంగము వారికి కళాకారులకు ప్రోత్సాహకరముగా ఉంటుంది.

తులారాశి ఫలాలు పరిహారము..

  1. మీ రాశిచక్రం యొక్క పాలక శక్తిని బలోపేతం చేయడానికి, శుక్రవారం మీ ఉంగరపు వేలుకి వెండి ఉంగరంలో డైమండ్ లేదా ఒపాల్ రత్నాన్ని ధరించాలి.
  2. గోమాతకు వీలైనంత వరకు సేవ చేయండి మరియు ఆమెకు పిండిని తినిపించండి మరియు ఆమెను మూడుసార్లు వెనుక తాకండి.
  3. ఇది కాకుండా, శనివారం మధ్య వేలుపై పంచధాతు లేదా అష్టాధాటు ఉంగరంలో నీలమణి రత్నం ధరించడం కూడా మీకు లాభదాయకమైన ఒప్పందమని రుజువు చేస్తుంది మరియు వృత్తిపరమైన విజయం లభిస్తుంది.
  4. బుధవారం ఒక జత పక్షులను విడిపించడం మీ అదృష్టాన్ని బలపరుస్తుంది.

Also Read:  Virgo: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 కన్యా రాశి ఫలితాలు

Exit mobile version