Gemini: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 మిధున రాశి ఫలితాలు

కళాకారులకు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించదు. వ్యవసారంగము ఆశాజనకముగా ఉండును. విద్యార్ధులు ప్రతిభతో విజయము సాధింతురు. ధార్మిక కార్యక్రమములకు ధనము వెచ్చింతురు.

శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 మిధున రాశి (Gemini) ఫలితాలు:

మృగ 3,4 పాదములు, ఆర్ద్ర 1,2,3,4 పాదములు, పున 1,2,3 పాదములు ఈ మిధున రాశి (Gemini) కిందకి వస్తాయి.

ఆదాయం :- 2, వ్యయం :- 11,
రాజపూజ్యం :- 2 అవమానం :- 4.

ఈ రాశివారికి ఈ సంవత్సరము అన్ని విషయములందు ఆశాజనకముగా ఉన్నను అనూహ్యముగా ఇబ్బందులు కూడ ఏర్పడగలవు. భాగస్వామ్య వ్యాపారములు ఆశాజనకంగా ఉండవు. ఆదాయము మించి ఖర్చులుండును. బంధువర్గ సహకారముతో శుభ ప్రయత్నములు సానుకూలమగును. కోర్టు వ్యవహారములు పరిష్కరించుటకు అధిక ఇబ్బందులనధిగమించవలెను. ఫైనాన్స్ రంగము వారికి ఆర్ధికముగా చాలా బాగుండును. ఉద్యోగుల బదిలీలు జరుగును.

రాజకీయముగా పదవులను పదిలపరచు కొనుటకు తగిన కృషి చేయవలెను. కళాకారులకు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించదు. వ్యవసారంగము ఆశాజనకముగా ఉండును. విద్యార్ధులు ప్రతిభతో విజయము సాధింతురు. ధార్మిక కార్యక్రమములకు ధనము వెచ్చింతురు. అప్పుడప్పుడు ఆర్ధిక సమస్య లేర్పడును. ఏ పనికైనను గట్టి ప్రయత్నము చేసిన కాని ఫలితము లభించదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి. నూతన వస్తువులు కొనుగోలు చేయుదురు.

2023 లో మిథునరాశి వారికి అదృష్ట సంఖ్య..

మిథున రాశిని పాలించే గ్రహం బుధుడు మరియు మిథునం యొక్క స్థానికులకు అదృష్ట సంఖ్యలు 3 మరియు 6. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జాతకం 2023 ప్రకారం 2023 సంవస్త్రానికి సంబంధించిన మొత్తం స్కోరు 7 సంఖ్యగా ఉంటుంది. ఈ విధంగా, ఈ సంవస్త్రం మిథున రాశి వారికి మధ్యస్థం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుందని నిరూపించవొచ్చు మరియు ఇది మీకు ప్రయోజనాలను కూడా సృష్టిస్తుంది.

మీ కోసం చాలా సవాళ్ళు ఉంటాయి కానీ ఆ సవాళ్లు మీ వల్ల కాదు కానీ సరైన కారణం లేకుండా ఉంటాయి.అయితే, మీరు మీ తెలివితేటలు మరియు శక్తితో ఈ సవాళ్ళను అధిగామించగలరు.మిథున రాశిఫలం 2023 ఈ సంవస్త్రం మీకు చాలా అవకాశాలను తెస్తుందని మరియు మీరు ఈ అవకాశాలను సమయానికి ముందే పరిగణలోకి తీసుకుంటే మీరు జీవితంలో పురోగమించవొచ్చు.

మిథున రాశి జ్యోతిష్య పరిహారాలు..

  1. ప్రతిరోజు ఇంట్లో తయారుచేసిన భోజనం నుండి ఆవు కోసం 1 వ చపాతీని తీసుకోండి.
  2. ప్రతి బుధవారం ఆవుకు పచ్చి బచ్చలి కూర, పచ్చి మేత, పచ్చి కూరగాయలతో పాటు సాబూత్ మూంగ్ దాల్ తినిపించండి.
  3. శ్రీవిష్ణువుకు అంకితం చేయబడిన శ్రీ విష్ణువు సహస్ర స్తోత్రాన్ని పటించడం వల్ల మీకు మేలు కలుగుతుంది.
  4. బుధవారం ఉపవాసం మిమల్ని ఆరోగ్యవంతం చేస్తుంది మరియు మీ వ్యాపారంలో మీకు ప్రక్రియను అందిస్తుంది.
  5. నాణ్యమైన పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల మీకు ఏంతో కలుగుతుంది.మీరు బుధవారం శుక్ల పక్షంలో ఈ రత్నాన్ని మీ చిటికెనే వేలికి ధరించవొచ్చు.
  6. మీరు ఏవైనా ఇబ్బందులు ఎడుర్కొనట్టు అయితే లేదా మీరు అనారోగ్యంతో ఉనట్టు అయితే గజేంద్ర మోక్ష స్తోత్రాన్ని పటించండి లేదా శ్రీ రామ రక్ష స్తోత్రాన్ని పటించండి.

Also Read:  Taurus: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 వృషభ రాశి ఫలితాలు