Site icon HashtagU Telugu

Aquarius: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 కుంభ రాశి ఫలితాలు

Aquarius 2023 2024

Aquarius 2023 2024

శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 కుంభ రాశి (Aquarius) ఫలితాలు:

ధనిష్టా 3, 4 పాదాలు; శతభిషం 4 పాదాలు; పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభ రాశి (Aquarius) కిందకి వస్తాయి.

ఆదాయం :- 11, అవ్యయం :- 5,
రాజపూజ్యం :- 2, అవమానం :- 6.

కుంభ రాశి వారు ఏలినాటి శని ప్రభావం చేత, బృహస్పతి తృతీయ స్థానమునందు సంచరించుట 2023 ఇబ్బందులు అధికముగా ఉంటాయి. కుంభ రాశి వారికి 2023లో మధ్యస్తము నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. కుంభ రాశి వారికి ఏప్రిల్ 2023 వరకు శని 12వ ఇంట మకర రాశి యందు సంచరించడం, గురుడు 2వ ఇంట సంచరించడం, మే 2023 నుంచి కుంభ రాశి వారికి శని 1వ ఇంట స్థానమునందు, గురు రాహువులు మూడవ స్థానమునందు సంచరించడంచేత కుంభ రాశి వారికి 2023 కొంత సమస్యలతో కూడినటువంటి సంవత్సరం.

కుంభ రాశి వారు 2023లో ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలయందు జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావంచేత కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు వ్యవహారాలు, చికాకులు వంటివి ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు కనబడుచున్నవి. కుంభరాశి వారు ఆర్ధిక విషయాల యందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. కుంభరాశి ఉద్యోగస్తులకు 2023 మధ్యస్త ఫలితాలున్నాయి. ఉద్యోగములో రాజకీయాలు, ఒత్తిళ్లు, సమస్యలు, చికాకులు అధికముగా ఉండును. కుంభ రాశి ఉద్యోగస్తులకు కొంత కష్టకాలముగా గ్రహస్థితి గోచరిస్తున్నది.

2023 కుంభ రాశి వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. వ్యాపారములో చికాకులు, ఆర్ధిక సమస్యలు ఏర్పడును. కుంభ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు అధికముగా ఉండును. కుంభ రాశి రైతాంగానికి 2023లో అనుకూలముగా లేదు. కుంభ రాశి సినీరంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితములు ఉన్నవి. 2023 కుంభ రాశి విద్యార్థులు కష్టపడి చదువవలసిన సంవత్సరం. మొత్తం మీద 2023 కుంభ రాశి వారికి మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావము చేత కుంభ రాశి వారు 2023లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మరియు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తగా ఉండాలని కుంభ రాశి వారికి సూచిస్తున్నాను.

కుంభ రాశి మరింత శుభఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించడం, ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం వలన మరింత శుభ ఫలితాలు కనబడతాయి. కుంభరాశివారు ధరించవలసినటువంటి నవరత్నం ఇంద్రనీలము. కుంభ రాశి వారు 7 ముఖములు గల రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితములు కలుగుతాయి.

Also Read:  Capricorn: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 మకర రాశి ఫలితాలు