హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు శ్రీరామనవమి పండుగ కూడా ఒకటి. ఈ శ్రీరామనవమి పండుగను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కొన్ని ఏ ప్రదేశాలలో కొన్ని రోజులపాటు ఈ శ్రీరామనవమి వేడుకలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరాముడు చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం చైత్ర మాసం తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి పండుగ జరుపుకుంటారు. కాగా చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి ఏప్రిల్ 5 న సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుంటారు. కనుక ఉదయం తిథి ప్రకారం ఈసారి శ్రీ రామ నవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. ఇకపోతే ఈరోజు పూజా విధానం విషయానికి వస్తే.. శ్రీ రామ నవమి రోజున ఉదయం నిద్రలేచి స్నానం చేయాలి. ఆ తరువాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తరువాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. ఒక స్టూల్ మీద ఒక గుడ్డను పరిచి, దానిపై రాముడి విగ్రహం లేదా చిత్ర పటాన్ని ఉంచాలి. గంగా జలం, పంచామృతం, పువ్వులు మొదలైనవి రాముడికి సమర్పించాలి.
దేవునికి పసుపు పండ్లు, చలిమిడి, పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలట. అలాగే రామచరిత మానస్ ను లేదా సుందరకాండ ను పారాయణం చేయాలట. చివరికి శ్రీ రామునికి హారతి ఇచ్చి పూజను ముగించాలట. దీని తరువాత పేదలకు, నిరుపేదలకు విరాళాలు ఇవ్వాలని చెబుతున్నారు. అయితే ఈ రామనవమి రోజున పూజ చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఈ రోజున పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందట. దీనివల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని, సీతా దేవి లక్ష్మీ దేవి స్వరూపం. అటువంటి పరిస్థితిలో రామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట.