Site icon HashtagU Telugu

Sri Rama Navami 2025: నవమి రోజు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు.. అంతా శుభం జరగడంతో పాటు లాభాలే లాభాలు!

Sri Rama Navami 2025

Sri Rama Navami 2025

హిందువులు ప్రతి ఏడాది శ్రీరాముని జన్మదినోత్సవం రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ శ్రీరామనవమి పండుగ రోజున దేశవ్యాప్తంగా పలు రామాలయాల్లో సీతారాముల విగ్రహాలకు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీరాముడు, హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి, జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు.

ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రీ రామ నవమి ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు. శ్రీ రాముడికి చాలా ఇష్టమైన విషయాలు ఉన్నాయి. శ్రీ రామ నవమి రోజున రామయ్యకి ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవడం వలన రాముడి ఆశీస్సులు మాత్రమే కాదు హనుమంతుడు, లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని చెబుతున్నారు. మరి ఇంతకీ శ్రీరామనవమి పండుగ రోజు ఎలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అన్న విషయానికి వస్తే.. శ్రీ రామ నవమికి ​​ముందు ఎవరైనా పసుపు వస్త్రం లేదా కొంత మొత్తంలో బంగారాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదం అని చెబుతున్నారు.

ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందట. భక్తుల ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉండేలా అనుగ్రహం కరుపిస్తుందని చెబుతున్నారు. అలాగే శ్రీ రామ నవమికి ​​ముందు శంఖం కొని ఇంటికి తీసుకురావాలట. ఇంట్లోని పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కొందరు దేవుళ్ళ పూజలో శంఖం లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణింపబడుతున్నది. అటువంటి దేవుళ్ళలో ఒకరు హనుమంతుడు. కనుక శ్రీ రామ నవమికి ​​ముందు ఇంటికి శంఖాన్ని తెచ్చుకోవడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా శ్రీరామనవమి పండుగ ముందు కాషాయ జెండాను ఇంటికి తెచ్చుకొని, ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంటి వైపు సానుకూల శక్తి ప్రవేశిస్తుందట. ప్రతికూల శక్తి నశిస్తుందని చెబుతున్నారు..