శ్రావణమాసం వచ్చింది అంటే చాలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారి ఆలయాలతో పాటుగా కేశవుల ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ శ్రావణమాసంలో ఆయా దేవుళ్ళకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు భజనలు, విశేష పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు మహిళలు వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు వంటివి కూడా నిర్వహిస్తారు. దీంతో ఈ మాసంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి ఈ మాసం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.
అయితే ఈ శ్రావణ మాసంలో కొన్ని రకాల పూజలు చేయడం వల్ల డబ్బుకు పరమైన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శ్రావణమాసంలో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శ్రావణ మాసంలో ఏ రాత్రి అయినా శివలింగం దగ్గర దీపం వెలిగించి, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇంట్లో డబ్బు సమస్య ఉంటే ఈ పరిహారం చేయడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చట. అప్పుల బాధలు ఉన్నట్లయితే దాని నుంచి విముక్తి పొందాలి అనుకున్న వారు అక్షింతలను నీటిలో కలిపి శ్రావణ మాసంలో ఏదైనా రాత్రి సమయంలో శివలింగానికి ఈ నీటితో అభిషేకం చేయడం వల్ల మన బాధల నుంచి విముక్తి పొందవచ్చును చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల రావాల్సిన డబ్బులు కూడా చేతికి అందుతాయట. శని దోషంతో ఇబ్బంది పడుతున్న వారు శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల శనిదోష సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు పండితులు. శ్రావణమాసం రాత్రి తూర్పు వైపుకు మీ ముఖాన్ని ఉంచి శివలింగం దగ్గర వడపప్పు ఒక చిన్న శంఖంతో పాటు ఏడు గవ్వలను ఉంచాలట. తర్వాత ఓం గం గణపతయే నమః అని చూపించాలట. విధంగా చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయట. సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలని కోరుకుంటున్న వారు శ్రావణమాసంలో ఏదైనా రాత్రి సమయంలో శివలింగాన్ని స్వయంగా మీ చేతులతో మట్టి శివలింగాన్ని తయారుచేసి, తర్వాత ఆచారాల ప్రకారం పూజించాలట.. అలాగే ఆ శివలింగానికి ఆవుపాలను కూడా సమర్పించాలని చెబుతున్నారు.