నేడు అనగా ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం మొదలైంది. అయితే ఈ శ్రావణ మాసాన్ని హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో సోమ మంగళ శుక్రవారాలను ప్రత్యేకమైన రోజులుగా భావించి దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలా పూజలు చేయడం మంచిదే కానీ కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. మరి శ్రావణమాసంలో శుక్ర మంగళ సోమవారాలలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శ్రావణమాసం శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడటం వల్ల అలా పిలుస్తారు. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల్లో చేసే పూజలు మంచి ఫలితాలు వస్తాయి. గ్రహదోషాలు కూడా తొలగిపోతాయట. ఆర్థిక సంక్షభంతో బాధపడుతున్నా, పెళ్లికాని వారికి కూడా ఇది శుభ సమయం అని చెబుతున్నారు. అలాంటి వారు శ్రావణ శుక్రవారం రోజు గోవుకు రొట్టె తినిపిస్తే అశేష ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. ఈ మాసంలో ఇలా చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చట. కాగా వివాహం కాని వారు శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం జరుపుకోవడంతో పాటుగా కుజ గ్రహం వద్ద దీపాలు పెట్టడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం వల్ల పెళ్లి సంబంధ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.
అలాగే మానసిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు శ్రావణ సోమవారాలలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం మంచిదని చెబుతున్నారు. పాలు బిల్వపత్రంతో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయట. శ్రావణ బుధవారం శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే అప్పుల బాధలు త్వరగా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శ్రావణమాసంలో గోమాతకు బెల్లం తినిపిస్తే శని దోషం తొలగిపోతుందట. ఇక మద్యం మాంసం తినేవారు ఈ మాసంలో వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.
note : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా పండితుల సలహా తీసుకోవడం మంచిది..