Site icon HashtagU Telugu

Sravana Somavar Vrat 2022 : ఆషాఢ మాసంలో పరమశివుడికి సోమవారం ఇలా పూజ చేస్తే జీవితంలో కష్టాలు తలెత్తవు…!!

Shiv

Shiv

హిందూ మతంలో ఆషాడ మాసానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది హిందూ క్యాలెండర్‌లో నాలుగవ నెల. శాస్త్రాల ప్రకారం, ఆషాఢ మాసంలో శివుడిని పూజించిన వారి ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆషాఢ మాసం ఈ సంవత్సరం జూన్ 29 నుంచి జూలై 28 వరకు ఉంటుంది. ఆషాఢం కోసం శివభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆషాఢం మాసం ప్రాముఖ్యత
ఆషాఢ మాసం శివునికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో శివుని పూజించి అభిషేకం చేస్తే విశేష పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివుడు తన భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు. జీవితంలో వివాహానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం, పూజ చేయడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి.

పూజా పద్ధతి
ఆషాఢంలో సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. శివలింగానికి పాలతో అభిషేకం ద్వారా మహాదేవుని ఉపవాసం కోసం ప్రతిజ్ఞ తీసుకోండి. ఉదయం, సాయంత్రం శివుడిని ప్రార్థించండి. పూజ కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించి, శివునికి పువ్వులు సమర్పించండి. జపం చేసిన తర్వాత శివుడికి తమలపాకులు, పంచ అమృతం, కొబ్బరికాయ, బిళ్వ పత్ర ఆకులను సమర్పించండి. ఉపవాస సమయంలో పంచాక్షరి జపించండి.

ఆషాఢ సోమవారాలు
ఆషాఢ మాసంలో సోమవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సారి మాసంలో నాలుగు సోమవారాలు ఉపవాసం ఉండాలి. ఆషాఢ సోమవారం మొదటి ఉపవాసం జూలై 4న ఉంటుంది. రెండవ సోమవారం ఉపవాసం జూలై 11న, మూడవది జూలై 18న, జూలై 25 నాలుగవ సోమవారం వస్తోంది. అయితే ప్రతి సోమవారం, ఈ వ్రతం చేయడం వల్ల మీకు మీకుటంబానికి ఎంతో శుభకరం అవుతుంది.