మామూలుగా స్త్రీలు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత రకాల నియమాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత జీవన శైలి కూడా మారుతుంది. అలాగే ధరించే ఆభరణాలు కట్టు బొట్లు కూడా మారుతాయి. అయితే ఇదివరకటి రోజుల్లో పెళ్లి అయిన స్త్రీలు నిండుగా ముత్తైదుగా ఉండేవారు. అంటే శరీరం కనిపించకుండా దుస్తులు ధరించడం, చేతినిండా గాజులు వేసుకోవడం, నుదిటిన అలాగే పాపిట్లో కుంకుమ బొట్టు ధరించడం, మంగళ సూత్రాన్ని ధరించడం, కాళ్ళకి మెట్లు పెట్టుకోవడం ఇలా ప్రతి ఒక్కటి ధరించి నిండు ముత్తైదువుగా కనిపించేవారు.
కానీ ప్రస్తుత రోజుల్లో స్త్రీలు ఎందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు. పట్టణ ప్రాంతాలలో అయితే వీటి సంగతి పక్కన పెట్టేస్తున్నారు. ఎప్పుడో పండుగలు, ఏదైనా ఫంక్షన్ల సమయంలో మాత్రమే ముత్తైదువుగా రెడీ అవుతున్నారు. పెళ్లయిన కూడా మంగళ సూత్రాలు ధరించకపోవడం, కాళ్లు మెట్లు ధరించకపోవడం లాంటివి చేస్తున్నారు. అసలు నిజానికి స్త్రీలు ముత్తైదుగా ఉండాలంటే ఏం చేయాలో ఎలాంటివీ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు స్త్రీలు కుంకుమను పాపిట్లో, కనుబొమ్మల మధ్యలో, కంఠం దగ్గర ముచ్చెలి గుంటలో ధరించాలి.
అలాగే ఉదయం నిద్ర లేవగానే స్నానమాచరించి ఇంటిముందు కల్లాపు చల్లి ముగ్గు పెట్టాలట. అలాగే తులసి మొక్క వద్ద అష్టదళ పద్మం, శంకు చక్రాలు, కృష్ణుని పాదాలు వేయాలట. ఎల్లప్పుడు మంగళసూత్రాన్ని మెడలో ధరించాలని చెబుతున్నారు. అలాగే ఆ మంగళసూత్రం భర్తకు తప్ప మరే ఇతరులకు కనిపించకుండా ధరించాలట. పొరపాటున కూడా భార్య ఎప్పుడూ భర్త కీడు కోరుకోకూడదని చెబుతున్నారు. స్త్రీలు ఎల్లప్పుడూ చిరునవ్వుతో నిండుగా లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉండాలట.