Kalasam: కలశంపై పెట్టిన కొబ్బరికాయను ఏం చేయాలో తెలుసా?

సాధారణంగా వారానికి ఒకసారి దేవుడి పటాలు అని శుభ్రం చేసి కలశంపై కొబ్బరికాయను పెడుతూ ఉంటారు. మళ్లీ వారం తర్వాత ఆ కలశం పై ఉన్న కొబ్బరికాయను తీస

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 06:50 PM IST

సాధారణంగా వారానికి ఒకసారి దేవుడి పటాలు అని శుభ్రం చేసి కలశంపై కొబ్బరికాయను పెడుతూ ఉంటారు. మళ్లీ వారం తర్వాత ఆ కలశం పై ఉన్న కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను పెడుతూ ఉంటారు. అయితే చాలామందికి ఒక సందేహం ఏమిటంటే కలిశం పై పెట్టిన కొబ్బరికాయలు ఏం చేయాలి? దానిని వంట కోసం వినియోగించవచ్చా? ఇలాంటి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలశపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక.

కాయపై ఉండే పొర చర్మం, పీచు మాంసం , దృఢంగా ఉండే చిప్ప ఎముకలు, లోపల ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు, కాయలోని నీళ్లు ప్రాణాధారం, పైన ఉండే మూడు కన్నులే ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే కొబ్బరికాయ పూజలో అంత ప్రత్యేకం. వెండి చెంబు, రాగి చెంబు, ఇత్తడి చెంబు ఎవరి వీలుని బట్టి వారు ఆ చెంబుకి పసుపు రాసి, బొట్లు పెట్టి ఆపై కొబ్బరి కాయ పెట్టి చుట్టూ మామిడి ఆకులు, పైన వస్త్రంతో అలంకరిస్తారు. అప్పుడు అది పూర్ణకుంభంగా మారి దివ్యమైన ప్రాణశక్తి నింపిన జడ శరీరానికి ప్రతీకగా ఉంటుంది.

కలశను పూజచేయడానికి వచ్చిన వారికి దానం ఇవ్వొచ్చు. దీన్ని పూర్ణఫల దానం అని అంటారు. ఇంట్లో పూజల సమయంలో కలశం పై పెట్టిన కొబ్బరికాయ ఇంట్లో వినియోగించుకోవచ్చు. ఏం జరుగుతుందో అనే భయం ఉన్నవారు పారే నీటిలో వేయవచ్చు. అంతేకానీ కలశం పై పెట్టిన కొబ్బరికాయ ఇంట్లో వినియోగిస్తే ఏదో జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. అందులో వాస్తవం లేదు. ఇక పూజలో వినియోగించే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగానే ఉంటే పర్వాలేదు కానీ కుళ్లితే మాత్రం కంగారుపడిపోతారు. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. అయితే భయపడాల్సింది ఏమీలేదంటారు పండితులు. కొబ్బరికాయ కుళ్లితే పూజలో ఏదో అపచారం జరిగినట్టు భావించాల్సిన అవసరం లేదంటారు. కలశలో నీటితో దేవుడి మందిరాన్ని, మిమ్మల్ని ప్రక్షాళన చేసుకుని మరో కొబ్బరికాయ కొడితే సరిపోతుంది. ఇక వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దిష్టిపోయిందని భావించాలి కానీ ఏదో అపశకునంగా ఫీలవ్వాల్సిన అవసరం లేదంటారు.