Vasthu Tips: ఇంటి ద్వారానికి ఎదురుగా అటువంటి ఫోటోలు పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

సాధారణంగా చాలామంది ఇంటి ద్వారం విషయంలో కొన్ని రకాల తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది నిర్మాణం విషయంలో తప్పు చేస్తే మరి కొంతమంది

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 06:45 PM IST

సాధారణంగా చాలామంది ఇంటి ద్వారం విషయంలో కొన్ని రకాల తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది నిర్మాణం విషయంలో తప్పు చేస్తే మరి కొంతమంది నిర్మించిన తర్వాత కొన్ని రకాల ఫోటోలు తగిలిస్తూ ఉంటారు. కొంతమంది దేవుళ్ళ ఫోటోలు,తగిలిస్తే మరి కొంతమంది దేవుళ్ళ రూపంలో ఉన్న టైల్స్ ని ఎదురుగా పెడుతూ ఉంటారు. ముఖ ద్వారం వాడు మాత్రమే కాకుండా ముఖద్వారానికి ఎదురుగా కూడా కొన్ని రకాల వస్తువులను అస్సలు ఉంచకూడదు.

ఎప్పుడు కూడా ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫొటోలు అమర్చరాదు. కేవలం దేవుళ్ల ఫొటోలు మాత్రమే అమర్చాలి. వినాయకుడి ఫొటో పెడితే ఇంకా మంచిది. ఇంటి గోడలు కట్టేట్టపుడు తాపీ మేస్త్రీలు, పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తుంటారు. వాటిని అవసరం తీరిన వెంటనే ఆ కన్నాలు తప్పనిసరిగా మూసేయ్యాలి.వాయువ్యం పెరిగినా,మూతపడినా ఇంకా వాయువ్యంలో ఇంకా దోషాలేమైనా ఉంటే వాయుపుత్రుడైన హనుమంతుడిని ఆ ప్లేస్ లో ఉంచి పూజిస్తే ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది.

తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం,ఉత్తర వాయువ్యం, పడమర నైరుతి,దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు. బీరువాలు నైరుతి వైపు ఉంచి ఉత్తరానికి తెరిచినట్టుండాలి. అలాగే తూర్పు, ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లు పెంచరాదు. మూడు పసుపు కొమ్ములు,పసుపు దారంతో గుమ్మానికి కడితే దృష్టిదోషం తొలగిపోతుంది..