Aquarium: ఇంట్లో అక్వేరియం ఉండవచ్చా.. ఏ దిశలో ఉండాలి.. ఎన్ని చేపలు ఉండాలో తెలుసా?

మాములుగా చాలామంది ఇంట్లో అక్వేరియం ని పెట్టుకుంటూ ఉంటారు. అందులో రకరకాల చేపలను పెంచుకుంటుంటారు. అయితే ఇంట్లో అక్వేరియం ఉండడం మంచిదే

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 08:40 PM IST

మాములుగా చాలామంది ఇంట్లో అక్వేరియం ని పెట్టుకుంటూ ఉంటారు. అందులో రకరకాల చేపలను పెంచుకుంటుంటారు. అయితే ఇంట్లో అక్వేరియం ఉండడం మంచిదే కానీ,అది సరైన దిశలో ఉండటం చాలాముఖ్యం. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో అక్వేరియం ఉంటే ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది. ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమి సమస్యలకు చెక్ పెట్టి అదృష్టాన్ని అందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అదృష్టానికి, ఇంట్లో ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ అక్వేరియం అన్నమాట. మరి అక్వేరియంలో ఎన్ని చేపలు ఉండాలి అన్న విషయానికి వస్తే..

అక్వేరియంలో 9 చేపలు ఉండడం మంచిది. వాటిలో 8 డ్రాగన్ చేపలు కాని, 8 గోల్డ్ ఫిష్‌లు కాని ఉండాలి. మిగిలిన ఒకటి కచ్చితంగా నల్లచేప ఉండాలి. డ్రాగన్ చేపలు, గోల్డ్ ఫిష్‌లు ఇంటి నుంచి దూరమైన అదృష్టాన్ని తిరిగి తీసుకొస్తాయి. నల్ల చేప ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది. మరీ ఈ అక్వేరియంని ఏ దిశలో పెట్టాలి అన్న విషయానికి వస్తే.. పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఇవన్నీ అక్వేరియంలో ఉండేలా చూడాలి. అక్వేరియంని స్వచ్ఛమైన నీటితో తగినంత పరిమాణంలో నింపాలి. అక్వేరియం లోపలి భాగంలో చిన్నచిన్న మొక్కలు ఏర్పాటు చేయాలి.

అక్వేరియం లోపల ఏదైనా లోహంతో ఒక ఆకృతి ఉంచాలి. రాళ్లు, గులకరాళ్లను లోపల అడుగుభాగాన ఏర్పాటు చేయాలి. ఐదవది ముఖ్యమైనది అగ్ని. ఇందుకోసం లోపల లైట్ వెలుగు పడేలా ఏర్పాటు చేయాలి. అక్వేరియం ఉంచాల్సిన సరైన ప్రదేశం డ్రాయింగ్ రూమ్.అక్కడ కూడా వాస్తు ప్రకారం తూర్పు దిశగా కాని, ఉత్తర దిశగా కాని ఉండాలి.

Follow us