Vasthu Tips: అక్వేరియం ఇంట్లో ఉండవచ్చా.. ఉంటే ఏ దిశగా ఉండాలి ఎన్ని చేపలు ఉండాలో తెలుసా?

చాలామందికి చేపలు అంటే చాలా ఇష్టం. చేపలను చూస్తే వారి వయసును మరిచిపోయి చిన్నపిల్లలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది చేపలను ఇష్టంగ

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 08:00 PM IST

చాలామందికి చేపలు అంటే చాలా ఇష్టం. చేపలను చూస్తే వారి వయసును మరిచిపోయి చిన్నపిల్లలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది చేపలను ఇష్టంగా అక్వేరియంలో పెంచుకుంటూ ఉంటారు. వాటి కోసం రకరకాల డిజైన్లు చేసినా అక్వేరియం లను తెచ్చి ఇంట్లో పెట్టుకుని వాటిని చూసి మురిసిపోతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం గా ఇంట్లో అక్వేరియం ఉండవచ్చా లేదా? ఒకవేళ ఉంటే ఏ దిశగా ఉండాలి? అక్వేరియంలో ఎన్ని చేపలు ఉండాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో అక్వేరియం పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు దానిని వాస్తు ప్రకారంగా పెట్టుకోవడం మంచిది. కాగా ఎన్ని చేపలు ఉండాలి అన్న విషయానికి వస్తే.. అక్వేరియంలో ఎప్పుడు కూడా 9 చేపలు ఉండేలా చూసుకోవాలి. వాటిలో 8 డ్రాగన్ చేపలు కాని, 8 గోల్డ్ ఫిష్‌లు కాని ఉండాలి. మిగిలిన ఒకటి కచ్చితంగా నల్లచేప ఉండాలి. డ్రాగన్ చేపలు, గోల్డ్ ఫిష్‌లు ఇంటి నుంచి దూరమైన అదృష్టాన్ని తిరిగి తీసుకొస్తాయి. నల్ల చేప ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది. అక్వేరియం లోని ఒక చేప చనిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు మరో చేపను తీసుకొచ్చి అందులో వేయాలి. చనిపోయిన చేపని ఇంటి బయట మట్టిలో పాతేయండి, అలాంటి చేపనే తిరిగి అక్వేరియంలో చేర్చాలి. ఎప్పటికప్పుడు లెక్క తొమ్మిదికి తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంట్లో అంతా మంచి జరుగుతుంది.

అలాగే పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఇవన్నీ అక్వేరియంలో ఉండేలా చూడాలి. అక్వేరియం ని స్వచ్ఛమైన నీటితో తగినంత పరిమాణంలో నింపాలి. అక్వేరియం లోపలి భాగంలో చిన్నచిన్న మొక్కలు ఏర్పాటు చేయాలి. అక్వేరియం లోపల ఏదైనా లోహంతో ఒక ఆకృతిని ఉంచాలి. రాళ్లు, గులకరాళ్లను లోపల అడుగు భాగాన ఏర్పాటు చేయాలి. ఇకపోతే అక్వేరియం ఏ ప్రదేశంలో ఉంచాలి అన్న విషయానికి వస్తే.. అయితే అక్వేరియం ని ఎప్పుడు వాస్తు ప్రకారం తూర్పు దిశగా కాని, ఉత్తర దిశగా కాని ఉంచాలి. రాత్రిళ్లు అందంగా కనిపిస్తుంది కదా అని బెడ్ రూమ్ లో ఉంచితే దంపతుల మధ్య , కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. అలా అని వంటింట్లో ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. సమయానికి తగ్గట్టుగా అక్వేరియంలోని పాత నీరును తీసేసి కొత్త నీరును నింపుతుండాలి.