Vastu Tips: ఏం చేసినా కూడా కలిసి రావడం లేదా.. అయితే వాస్తు దోషం ఉందేమో చెక్ చేసుకోండిలా?

చాలామంది ఎటువంటి పనులు మొదలు పెట్టిన కూడా జరగడం లేదని బాధపడుతూ ఉంటారు. ఏ పని విజయవంతం కాకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు. అయితే అటు

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 08:15 PM IST

చాలామంది ఎటువంటి పనులు మొదలు పెట్టిన కూడా జరగడం లేదని బాధపడుతూ ఉంటారు. ఏ పని విజయవంతం కాకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు. అయితే అటువంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్న పనులు జరగడం లేదు అంటే మనకు తప్పకుండా వాస్తు దోషం ఉన్నట్టు గుర్తించాలి. మనకు వాస్తు దోషం ఉందని ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా కొన్ని ఇల్లు చూస్తే వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దోషం కనబడదు.

కానీ ఆ ఇంట్లో నివాసం ఉన్నప్పటి నుంచీ అకారణంగా వివాదాలు, చికాకులు, ఆనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తి జాతకంలో దోషాలు కూడా జరిగి ఉండొచ్చు. కానీ జాతకంలో ఎలాంటి దోషం లేకపోయినా ఇలా జరుగుతోందంటే ఈ ఇంట్లో వాస్తుదోషం ఉన్నట్టే. మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది. కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకుగా అనిపిస్తుంది. పెంపుడు కుక్క పదే పదే ఒకే దిశకి తిరిగి అరవటం కూడా ఒక సూచనే. కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణంగా భయం వేస్తుంది. అంటే ఆ ఇళ్లలో గతంలో ఆత్మహత్యలో, హత్యలో జరిగి వుండొచ్చు.

అంటే పిశాచాలు అక్కడే తిరుగుతున్నాయని కాదు కానీ కొన్ని చికాకులు మాత్రం ఉండిపోతాయి. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షిణ చేయటం వల్ల కూడా కనపడిని వాస్తు లోపాలున్నాయని సూచనలు. కొన్ని నివాసాలైతే ఎంత అందంగా సర్దినా ఏదైనా చికాకుగా కనపడతాయి. వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్లని కొన్ని చికాకుల కారణంగా వదిలివెళ్లలేం. అలాంటప్పుడు దోషం ఏంటో తెలుసుకుని తగిన పరిష్కారం చేయిస్తే సరిపోతుంది. అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకుల నుంచి తప్పించుకోలేం. కొన్నిసార్లు ఎన్ని చికాకులున్నా మీరు స్ట్రాంగ్ గా ఉంటే ఏ దోషమూ మిమ్మల్ని ఏం చేయలేదు.