Locker: లాకర్ లో ఇవి పెడితే చాలు.. లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళదు?

మనం ఇంట్లో డబ్బు దాచుకునే లాకర్ ను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లాకర్ లో విలువైన వస్తువులను డబ్బులను దాచి ఉంచుతారు. అయితే ఎప్పుడు కూడా

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 08:56 PM IST

మనం ఇంట్లో డబ్బు దాచుకునే లాకర్ ను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లాకర్ లో విలువైన వస్తువులను డబ్బులను దాచి ఉంచుతారు. అయితే ఎప్పుడు కూడా లాకర్ ను ఖాళీగా ఉంచకూడదు. మరి లాకర్ సంబంధించిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తమలపాకును పూజలో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇది గౌరీ,గణేశుని స్వరూపం. పూజలో ఉపయోగించిన తమలపాకును లాకర్ లో ఉంచాలి. జ్ఞానానికి అధిపతి అయిన గణేష్ ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే కొలువై ఉంటుంది. లక్ష్మీ పూజలో తమల పాకు ఉంచి తమలపాకు పై ఎర్రని దారాన్ని, అక్షత, కుంకుమ, పుష్పం, ఇతర పూజా ద్రవ్యాలతో చుట్టి పూజ తర్వాత ఈ తమలపాకు ను లాకర్ లో ఉంచాలి.

అయితే శుక్రవారం రోజు వెండి నాణేలను పసుపు గుడ్డలో ఉంచి, కొద్దిగా కుంకుమ కూడా కట్టి వాటిని లాకర్ లేదా డబ్బు ఉంచే స్థానంలో ఉంచాలి. వీటితో పాటు కొద్దిగా పసుపు ముద్దగా చేసి ఉంచాలి.పది రూపాయ నోట్ల కట్ట ఒకటి, రాగి నాణేలు ఎప్పుడూ లాకర్ లో ఉంచాలి. లేదా వెండి నాణేలు ఉంచాలి. రావి ఆకు మీద ఆవు నెయ్యి కలిపిన సింధూరం ఉంచి దాన్ని పూజలో పెట్టి 5 శనివారాలు ఒక్కోటి చొప్పున లాకర్ లో లేదా డబ్బు దాచుకునే స్థలంలో ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. మంత్ర, తంత్రాలలో ఆగ్నేయ శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని పూజా స్థలంలో లేదా లాకర్ లో ఉంచితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షించి దరిద్రుడిని కూడా రాజు గా మారుస్తుంది.

బెహరా ఆకులు, వేళ్లను పుష్యమి రోజు పూజించి ఎర్రటి గుడ్డలో కట్టి లాకర్ లో ఉంచాలి. ఇది సంపదను పెంచుతుంది. పుష్య నక్షత్రం రోజున శంఖ పుష్పి వేరును తీసుకుని దానిని దేవతా ప్రతిమలా పూజించి ఆ తర్వాత ఒక వెండి పెట్టెలో, డబ్బు దాచుకునే చోట, లాకర్లో, వ్యాపార స్థలాల్లో పెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ప్రతి పష్యమి నక్షత్రం రోజున ఈ వేరును మారుస్తూ ఉండాలి. ఇంట్లో ఐశ్వర్య విజ్ఞాన యంత్రాన్ని లేదా దండ యంత్రాన్ని ప్రతిష్టించుకోవాలి. ఈ రెండింటిలో ఒక దానిని పూజించి లాకర్ లో ఉంచాలి. ఫలితంగా లాకర్ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. డబ్బు పెరుగుతూనే ఉంటుంది.

సంపద వృద్ధికి లాకర్ లో పవిత్రమైన కాళీ గుంజల గింజలను 11 ఉంచాలి. లాకర్ లో ఎప్పుడూ ఒక ఎర్రని వస్త్రాన్ని ఉంచాలి. వ్యాపార స్థలంలో లేదా లాకర్ లక్ష్మీ గణపతి బొమ్మ పెట్టుకోవాలి. అలాగే వ్యాపారంలో ఆశించిన విధంగా లాభాలు లేకపోతే ఏదైనా శనివారం 21 రక్త గుంజలను నీలి రంగు గుడ్డలో కట్టి లాకర్ లో ఉంచాలి. ప్రతి రోజు మీ ఇంటి ఇలవేల్సును ధ్యానిస్తూ ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. ఇలా క్రమం తప్పకుండా చెయ్యడం వల్ల వ్యాపారంలో లాభాలతో పాటు విజయం కూడా పొందుతారు .