Site icon HashtagU Telugu

Spirituality: మర్రిచెట్టుకు పూజలు ఎందుకు చేస్తారు.. వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Spirituality

Spirituality

సాధారణంగా హిందువులు రక రకాల మొక్కలను పూజిస్తూ ఉంటారు. వృక్షాలని దేవతలతో పోలుస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. భారతదేశ ప్రజలు పూజించే చెట్లలో మర్రిచెట్టు కూడా ఒకటి. దీనినే వటవృక్షం అని కూడా అంటారు. మర్రిచెట్టు వరుణుడి స్థలంగా దేవతలు మునులు కీర్తిస్తారు. దీనిని న్యగ్రోధ వృక్షం అని కూడా పిలుస్తారు. న్యగ్రోధ వృక్షమంటే కిందకు పెరిగే చెట్టు అని అర్థం. ప్రళయ కాలంలో జగమంతా జలమైనప్పుడు శ్రీమహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రం పై మార్కండేయ మహామునికి దర్శనము ఇచ్చాడని భాగవతం చెబుతోంది.

ఈ అశ్వత్థ వృక్షం దేవతల నివాస స్థానం అని అధర్వణ వేదంలో ప్రస్తావించారు. ఆధ్యాత్మిక పరంగా మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. బెరడులో శ్రీ మహావిష్ణువు, వేరులో బ్రహ్మ, కొమ్మల్లో శివుడు ఉంటారని విశ్వసిస్తారు. మర్రిచెట్టును పూజిస్తే సంతానాన్ని, సంపదను అందిస్తుందని విశ్వసిస్తారు. సంతానం లేని వారు మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దక్షిణా మూర్తి మర్రిచెట్టు కింద కూర్చుని ధ్యానం చేసినట్టు పురాణాల్లో ఉంది. భగవద్గీతలో జీవితానికి అర్ధాన్ని అర్జునునికి బోధించే సమయంలో కృష్ణభగవానుడు చెప్పిన ఉదాహరణ మర్రిచెట్టే. అందుకే మర్రిచెట్టును పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు.

వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్టనష్టాల నుంచి బయటపడాలంటే మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, రాత్రిపూట వారి దిండుకింద మర్రివేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుందని విశ్వసిస్తారు. మర్రిచెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు. శనివారం మర్రిచెట్టు కాండం మీద పసుపు, కుంకుమ సమర్పించడం వల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే, గుడి దగ్గరున్న మర్రి చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు. మర్రి చెట్టుపై తెల్లటి నూలు దారాన్ని 11 సార్లు కట్టి నీరుపోస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Exit mobile version