Spirituality: నిద్ర లేవగానే అరచేతులు చూసుకోవడం మంచిదేనా?

సాధారణంగా చాలామందికీ లేవగానే దేవుడి ఫోటోలు లేదంటే అరచేతులు చూసుకోవడం అలవాటు. మరి కొంతమంది మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎలా పడితే అలా నిద్ర

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 06:10 PM IST

సాధారణంగా చాలామందికీ లేవగానే దేవుడి ఫోటోలు లేదంటే అరచేతులు చూసుకోవడం అలవాటు. మరి కొంతమంది మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎలా పడితే అలా నిద్ర లేవడం వేటిని పడితే వారిని చూడడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదురుకోవడంతో పాటు ఆరోజు అంతా కూడా ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఇబ్బందికరంగా మనసంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అందుకే చాలామంది ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు తెల్లవారుగానే ఎవరి మొఖం చూసానో ఏంటో అని అనుకుంటూ ఉంటారు. ఇంకొందరు సెంటిమెంట్గా భార్య ముఖం లేదంటే తల్లిదండ్రులు మోకాలు పిల్లల ముఖాలు చూస్తారు..

ఎవరీ సెంటిమెంట్ తగ్గట్టుగా వాళ్ళు నిద్ర లేవగానే చూస్తూ ఉంటారు. మరి నిద్ర లేవగానే అరచేతులు చూసుకోవడం మంచిదేనా అలా చూసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక మంత్రాన్ని అనుకోవడం మర్చిపోకూడదు. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం.. ఈ జపాన్ని అనుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది. పని మనసులో అనుకొని అరచేతులను చూసుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. అయితే మన చేయి పైభాగాన లక్ష్మీదేవి, మధ్యభాగంలో సరస్వతి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు. కాబట్టి ఆ శ్లోకం చదివి రెండు చేతులు కళ్లకు అద్దుకుని నిద్ర లేవాలి. ఏ పని చేసినా చేతి చివరిభాగం ప్రధాన పాత్ర వహిస్తాయి.

చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి. ఎంత కష్టపడితే అంత ఫలితం అంత డబ్బు నీ సొంతమవుతుంది. అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీసమానం. సరస్వతీ కటాక్షం సిద్ధించాలన్న, చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకుని చదవాలి. అంటే కరమధ్యే సరస్వతి. చదువుపై ఎంత శ్రద్ధ, పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతీ కటాక్షం అన్నమాట. చేతిమూలం మీదే శక్తంతా ఉంటుంది. నేలపై పడినప్పుడైనా, పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మిభాగంలో ఆనుకుని లేస్తాం. అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టుదగ్గరే. అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాం. ఆ స్వరూపం గౌరీదేవి. నిద్రలేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరువకూడదు.

ధర్మ శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. కేవలం అర చేతులు మాత్రమే కాకుండా ఇంకా నిద్రలేవగానే ఇంకా ఎవర్ని చూడాలి అన్న విషయానికి వస్తే.. బంగారం, సూర్యుడు, ఎర్ర చందనం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడిచేయి, ధర్మపత్నిని చూడవచ్చు. నిద్ర లేవగానే ఏం చూడకూడదు అన్న విషయానికి వస్తే.. జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను, బొట్టులేని ఆడపిల్లను, ఇంట్లో ఉడ్వని ప్రదేశాలను చూడకూడదు. అద్దంలో మీ ముఖం మీరే చూసుకోకూడదు.