Site icon HashtagU Telugu

Spirituality: స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఎక్కువగా చేసే పొరపాట్లు ఇవే?

Mixcollage 06 Dec 2023 06 58 Pm 8628

Mixcollage 06 Dec 2023 06 58 Pm 8628

ఒక స్త్రీకి మెడలో తాళి అందం. కానీ ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ పేరుతో తాళిని తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఈ ఫ్యాషన్ పేరుతో ఆ తాళి అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. మంగళ సూత్రం అనేది భార్యాభర్తల మధ్య శాశ్వతమందానికి గుర్తు. ఈ మంగళసూత్రం వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. అయితే ప్రస్తుత రోజుల్లో మంగళసూత్రం వేసుకునే మహిళలు కూడా వారికీ తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తారు. మరి స్త్రీలు చేస్తున్న ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్త్రీలు ధరించే మంగళసూత్రం ఎప్పుడు కూడా హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కిందవరకు ఉండాలి. సౌభాగ్యానికి ప్రతీకలైన పసుపు కుంకుమలను నిత్యం సూత్రాలకు పెట్టుకోవాలి. చాలామంది మంగళసూత్రాల్లో పగడాలు, ముత్యాలు, అమ్మవారి రూపు పెట్టించుకుంటారు. అయితే ఇవి అందంగా ఉంటాయి కానీ మంగళసూత్రాలకు మాత్రం ఉండకూడదు.
అలాగే మహిళలు ధరించే మంగళసూత్రానికి ఇరువైపులా ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండాలి. మంగళ సూత్రాలకు చాలామంది పిన్నీసులు పెడుతుంటారు. అసలు మంగళసూత్రాలకు ఇనుము వస్తువు తగలకూడదు. ఎందుకంటే ఇనుము నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. దీంతో బంధం మధ్య అన్యోన్యత లోపిస్తుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ స్త్రీలు పొరపాటున కూడా మంగళసూత్రానికి పిన్నిసులు తగిలించడం లాంటివి చేయకూడదు. మంగళ సూత్రాలకు ముత్యం,పగడం కలిపి వేసుకోవడం మంచిదే.

కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్లు గ్రహదోషాలను తొలగించి వైవాహిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. సాధారణంగా స్త్రీలకు కుజ గ్రహ ప్రభావం వలన అతికోపం, కలహాలు, మొండితనం, అనారోగ్యం, రుతు దోషాలు ఏర్పడతాయి. పగడం, ముత్యం ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ ఇంట్లో అయినా స్త్రీ ప్రశాంతంగా ఉంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది. అదేవిధంగా స్త్రీలు ఎప్పుడూ కూడా మంగళసూత్రాన్ని తన భర్తకు తప్ప ఇతరులకు కనిపించే విధంగా కదిరించకూడదు. ఆ విధంగా ధరించడం అస్సలు మంచిది కాదు.