Plait: జుట్టు విరబోసుకొని తిరిగితే ఏం జరుగుతుందో తెలుసా?

ఇదివరకటి రోజుల్లో స్త్రీలు ఎంచక్కా తల స్నానం చేసి తలను దువ్వుకుని జడ వేసుకుని పూలు పెట్టుకునేవారు. కానీ ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీల

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 06:30 PM IST

ఇదివరకటి రోజుల్లో స్త్రీలు ఎంచక్కా తల స్నానం చేసి తలను దువ్వుకుని జడ వేసుకుని పూలు పెట్టుకునేవారు. కానీ ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు సంప్రదాయబద్ధంగా జడ అల్లుకుని పూలు పెట్టుకునే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు. ఫంక్షన్లకు, ఏదైనా కార్యక్రమాలకు బయటకి వెళితే తప్ప అందంగా జడ వేసుకోవడానికి ఇష్టపడడం లేదు.. అది కూడా ఈ మధ్యకాలంలో వెంట్రుకలను విరబోసుకోవడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. ఇందులో కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ వచ్చాయి. జుట్టుని చిన్నగా కట్ చేసుకుని క్లిప్పో, రబ్బరు బ్యాండో పెట్టి వదిలేస్తున్నారు.

లేదంటే కట్ చేసి పోనీ స్టైల్ అంటున్నారు. దాదాపు 70 శాతం అమ్మాయిలు జుట్టు విరబోసుకునే తిరుగుతున్నారు. చివరకు పెళ్లిళ్లలో కూడా వాలు జడల ప్లేస్ లో రెడీమేడ్ జడలు వచ్చి చేరాయి. అయితే జడను ఎందుకు వేసుకోవాలి? జడ వేసుకోకుండా జుట్టు అలాగే విరబోసుకొని తిరగడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా చాలా మంది రెండు జడలు వేసుకుంటే మరికొందరు ఒక జడ ఇంకొందరు మాత్రం ముడి పెట్టుకుంటూ ఉంటారు.. ఇలా మూడు విధాలుగా జడలను వేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు జుట్టుని నచ్చినట్టు జడ వేసుకోవడం కాదు వయసుని బట్టి అల్లుకునేవారు. ఆడ పిల్లలు రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్న పిల్ల అని, పెళ్లి కాలేదని అర్ధం.

ఆ అమ్మాయిలో జీవేశ్వర సంబంధం విడి విడిగా ఉందని అర్థం. ఇక పెళ్లైన మహిళలు మొత్తం జుట్టుని ఒకటే జడగా వేసుకునే వారు. అంటే ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం
జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుందంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం. కొంతమంది మూడు పాయలతో కలిపి జడలుతూ ఉంటారు. దాని అర్థం.. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం. సత్వ, రజ, తమో గుణాలు. అలాగే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అన్న అర్ధాలు కూడా ఉన్నాయని అంటారు. ఇకపోతే జుట్టు విరబోసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జుట్టు విరబోసుకుంటే పిశాచాలకు ఆహ్వానం పలకడమే అంటారు పండితులు. తలకి స్నానం చేసిన తర్వాత కూడా జుట్టు ఆరేలోగా కనీసం చివర్లైనా ముడివేయాలంటారు. జుట్టు విరబోసుకుని, క్లిప్పులు పెట్టుకుని దేవాలయానికి వెళ్లకూడదు. అలా చేస్తే జ్యేష్టా దేవి మీ వెంటే ఉంటుందట. అయితే మరి దేవతలు జుట్టు విరబోసుకుంటారు కదా అన్న ప్రశ్న మీకు రావచ్చు..ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపం. సత్వ,రజో,తమో గుణాలు ఆమెలో ఉండవు. అమ్మవారు కామాన్ని హరించేది. అందుకే దేవతలకు ఈ నియమం వర్తించదు.