Spirituality: అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

హిందువులు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలిసి తెలియక దీపారాధన విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల పూజ చేసిన

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 10:00 PM IST

హిందువులు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలిసి తెలియక దీపారాధన విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల పూజ చేసిన ఫలితం దక్కకపోగా దేవుడు ఆగ్రహానికి లోనవ్వక తప్పదు. దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. అంటే దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. అయితే మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు కానీ స్టీలు కుందుల్లో మాత్రం దీపారాధన చేయరాదు.

అయితే దీపారాధన చేసే సమయంలో ముఖ్యంగా దీపం వెలిగించేటప్పుడు కొందరు నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారు. కానీ అలా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకహారతి తో కానీ, అగరుబత్తితో కానీ వెలిగించాలి. అలాగే ఒక వత్తితో దీపారాధన చేయకూడదు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులతో దీపారాధన చేయవచ్చు. మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని అర్థం.

ఇక మూడు వత్తులు ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం. అలాగే దీపాన్ని ఎప్పుడు కూడా దేవుడికి ఎదురుగా ఉంచకూడదు. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. అలాగే పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఇక ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి.