Spirituality: భోజనం బాగోలేదు అని తిట్టుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

సాధారణంగా మనం ఆహార విషయంలో తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం. మనం తెలియకుండా చేసే ఆ తప్పుల వల్ల అన్నపూర్ణాదేవిని అవమానించినట్టు అవ

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 06:30 PM IST

సాధారణంగా మనం ఆహార విషయంలో తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం. మనం తెలియకుండా చేసే ఆ తప్పుల వల్ల అన్నపూర్ణాదేవిని అవమానించినట్టు అవుతుంది. మనం మనం భోజనం చేసేటప్పుడు ఇంట్లో ఎటువంటి విషయాలు పాటించాలి ఎటువంటి విషయాలు పాటించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనె తో దీపారాధన చేయాలి. అలాగే ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి.

ఎప్పుడు కూడా దేవుడికి పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు. అలాగే కాచి చల్లారిన పాలు అభిషేకంకి ఉపయోగించకూడదు. ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు. అలాగే ఎప్పుడు కూడా రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు.

అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తినకూడదు. తిట్టుకుంటూ తినే భోజనం శక్తిని ఇవ్వకపోగా రోగానికి హేతువు. అంతే కాకుండా భోజనాన్ని తిట్టుకుంటూ తినేకన్నా పూర్తిగా తినడం మానేయ్యడం మంచిది. కనీసం ఉపవాస ఫలితం అయినా దక్కుతుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ కూడా కంచం ముందు కూర్చున్నప్పుడు పోట్లాడుకోకూడదు, తిట్టుకోకూడదని చెబుతూ ఉంటారు. అలాగే అన్నం ముందు కూర్చుని తింటున్నప్పుడు ఎవరైనా ఒక మాట అన్నా కూడా అన్నంలో చేతులు కడిగేయడం అన్నం తినకుండా మానేసి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టు అవుతుంది. అలాగే ఎప్పుడైనా కానీ మనిషి వచ్చి కూర్చున్న తర్వాత భోజనం వడ్డించాలి. అంతేకానీ మనిషి రాకముందే భోజనం వడ్డించరాదు. ఎందుకంటే మనకోసం భోజనం ఎదురు చూడకూడదు.భోజనం కోసమే మనం ఎదురు చూడాలి. అలాగే ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు. ఇంట్లో తరచుగా సాంబ్రాణి పొగ వేస్తూంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది