Molathadu: మగవారు మొలతాడు కట్టుకోవడం వెనుక ఉన్న కారణం ఇదే?

మామూలుగా మగ వారికీ మొలతాడు వేసుకోవడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం. కొంతమందివెండి మొలతాడు ధరిస్తే మరి కొంతమంది ఎర్రటి మొలతాడు మరి

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 07:45 PM IST

మామూలుగా మగ వారికీ మొలతాడు వేసుకోవడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం. కొంతమందివెండి మొలతాడు ధరిస్తే మరి కొంతమంది ఎర్రటి మొలతాడు మరి కొంతమంది నల్లని మొలతాడు ధరిస్తూ ఉంటారు. ఇది ఏదో మూఢ నమ్మకం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే దీని వెనుక సైన్స్ దాగి ఉంది. మొలతాడు అన్నది ఆరోగ్య భద్రతకోసం ఏర్పాటు చేసిన పురుష ఆభరణం. మన శరీరం దేవ-రాక్షసాలుగా ఉంటుంది.

నడుము పైభాగం దేవభాగమైతే, తక్కిన భాగమంతా రాక్షసభాగం. దేవభాగాన్ని ఉత్తమమైన బంగారంతో గానీ లేదా అంతకంటే శ్రేష్ఠమైన నవరత్నాలతోగానీ అలంకరించుకోవాలని సనాతన ధర్మం చెబుతోంది. రాక్షసభాగానికి వెండిని వాడుకోవడం ఆచారం. నడుము సంగమస్థానం కనుక స్థాయినిబట్టి వెండి, బంగారం లేదా తాడుని వినియోగించవచ్చు. సాధారంగా నలుపు,ఎరుపు దారంతో మొలతాడు కట్టుకుంటారు. కొందరు వెండి, బంగారంతో తయారు చేయించుకుని కట్టుకుంటారు. మొలతాడు మార్చాల్సి వచ్చినప్పుడు కొత్తది కట్టిన తర్వాతే పాతది తొలగిస్తారు కానీ ఒక్క క్షణం కూడా మొండి మొలతో ఉండకూడదు అని చెబుతారు.

మొలతాడు అనేది అలంకారానికి సంబంధించిన వస్తువు కాదు. దీని వ‌ల్ల దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం ఉండ‌దని భావిస్తారు. మరి ముఖ్యంగా దిష్టి తగలకూడదని మొలతాడు కడతారు. చిన్నపిల్లలకు నల్లటి మొలతాడుతో పాటూ రంగురంగుల పూసలు కట్టడం వెనుక కారణం కూడా ఇదే. శరీరాన్ని మధ్యగా బాహ్యరూపంలో విభజించి చూపిస్తుంది. మొలతాడు కట్టిన పై భాగం అలంకారం,పూజా పునస్కారాలకు సంబంధించినది అని చెప్పడమే అంతరార్ధం. కొంద‌రికి జాత‌క రీత్యా ఉండే దోషం తగ్గేందుకు కూడా తాయెత్తులు మొలకు కట్టేవారు నల్లటి తాడుని మొలకి కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటారు.

చిన్నపిల్లలకు మొలతాడు కడితే వాళ్ళు పెరుగుతున్న సమయంలో ఎముకలు, కండరాలు సరియైన పద్ధతిలో వృద్ధిచెందుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మగపిల్లలకు జనన అవయయం ఆరోగ్యంగా పెరుగుతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడ కట్టినా పెద్దవారైన తర్వాత కేవలం పురుషులు మాత్రమే మొలతాడు వినియోగిస్తారు. పెళ్లైన స్త్రీకి మెడలో మంగళసూత్రంలా ఎంత ముఖ్యమో పురుషులకు మొలతాడు అంతే ముఖ్యం. అందుకే అప్పట్లో మొలతాడు లేని పురుషులను భార్య చనిపోయిందా అని అడిగేవారు. మొల‌తాడును ధ‌రించ‌డం వ‌ల్ల మనం తినే ఆహారంపై కంట్రోల్ ఉంటుంది. కాస్త ఎక్కువ తిన్నాసరే మొలతాడు బిగుసుకుపోతుంది. అంటే మనం తినాల్సినదానింటే ఎక్కువ తిన్నామని అర్థమవుతుంది.

బిగుసుకుపోతున్న మొలతాడు కారణంగా పొట్ట పెరుగుతుందని సంకేతాలు ఇస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు. ఇలా బ‌రువు అదుపులో ఉంటుంది, జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది, బానపొట్టని నివారిస్తుంది. మొల‌తాడు ధరించేవారికి హెర్నియా రాదని చెబుతారు. పైగా వెన్నుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మొలతాడు కట్టుకోవడం మంచిదంటారు. చిన్న పిల్లల మొలతాడుకి తాయెత్తులు కట్టేవారు. ఆ తాయెత్తులో బొడ్డుతాడు మూలకణాలు పెట్టి వాటికి పసరు మందులు పూసి కట్టేవారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని నమ్మకం.