Site icon HashtagU Telugu

Spiritual: స్త్రీలు జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళవచ్చా?

Spiritual

Spiritual

మామూలుగా మనకు పూజ విషయంలో అలాగే దేవాలయాలకు వెళ్లే విషయంలో ఎన్నో రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. అటువంటి వాటిలో స్త్రీలు జుట్టు విరబోసుకొని ఆలయాలకు వెళ్ళవచ్చా లేదా అన్న సందేహం కూడా ఒకటి. కొంతమంది చక్కగా జుట్టును అల్లుకుని దేవాలయాలకు వెళితే మరి కొంతమంది ఫ్యాషన్ పేరుతో అలాగే దేవాలయాలకు వెళుతూ ఉంటారు. మరి స్త్రీలు ఈ విధంగా జుట్టు విడ
రబోసుకుని ఆలయాలకు వెళితే ఏం జరుగుతుంది? అలా వెళ్లవచ్చా వెళ్ళకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం జనరేషన్ లో స్త్రీలు అలాగే యువతలు తల స్నానం చేసి కనీసం జుట్టును అల్లుకోకుండా అలాగే విరబోసుకొని దేవాలయాలకు వెళ్లడం అన్నది మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే ఇలా వెళ్తే భగవంతుడికి అపచారం చేసిన వారు అవుతారట. అలాగే అకాల దోషాల బారిన పడతారట. భగవంతుడికి చేసే సేవలు ఉపచారాలు శుచిగా శుభ్రంగా చేయాలని జుట్టు విరబోసుకోవడం వల్ల వెంట్రుకలు రాలి పూజా దవ్యాలలో పడి అవి అపవిత్రం అవుతాయని చెబుతున్నారు. దేవాలయాల్లో ప్రసాద నివేదనం జరుగుతూ ఉంటుంది.

జుట్టు విరబోసుకోవడం వల్ల మన జుట్టు నుంచి రాలే వెంట్రుకలు పొరపాటున ఆహార పదార్థాలలో పడితే ఆ భోజనం వృధా అవుతుందట. అలాగే వ్రత దీక్షలలో ఉన్న వారి కాలికి తల వెంట్రుకలు గానీ జుట్టునుంచి రాలిన నీటి బిందువులు కానీ తగలడం వల్ల దీక్ష భంగం కలుగుతుందట. ఆ దోషం కారణమైన వారికి తగులుతుందని చెబుతున్నారు. కాబట్టి దేవాలయాలకు గాని శుభకార్యాలకు కానీ అలాగే ఇంట్లో కూడా జుట్టు విరబోసుకుని తిరగడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

Exit mobile version