Astrology Remedies: మన వంటింట్లో ఉండే మసాలా దినుసులలో మిరియాలు కూడా ఒకటి. ప్రతి ఒక్కరి ఇంట్లో మిరియాలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని చాలా రకాల వంటల తయారీలలో ఉపయోగిస్తూ ఉంటారు. కాగా మిరియాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జలుబు, గొంతు నొప్పి లాంటివాటి నుంచి ఉపశమనం కలిగించడంలో ఇవి మనకు ఎంతో బాగా సహాయపడతాయి. చాలా మంది జలుబు చేయగానే ఇంట్లోనే మిరియాలతో రసం తయారు చేసుకొని మరీ తింటారు. అయితే ఆరోగ్య సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలను మిరియాలను ఉపయోగించి తగ్గించుకోవచ్చట.
ముఖ్యంగా మిరియాలు గ్రహాలతో ముడిపడి ఉంటాయి. ఇంట్లో మిరియాలు ఉంచుకోవడం వల్ల కొన్ని రకాల గ్రహాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. ఈ మిరియాలను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుంటే చాలా రకాల సమస్యల నుంచి బయటపడవచ్చట. దిండు కింద మిరియాలు పెట్టుకుని నిద్రపోతే, మిరియాల శక్తి రాత్రిపూట మీ నిద్రకు భంగం కలిగించే ప్రతికూల శక్తిని, చెడు ఆలోచనలను తొలగిస్తుందని చెబుతున్నారు. దిష్టి తగలడం లాంటి సమస్య కూడా ఉండదట. కుటుంబంలో అప్పుడప్పుడు ఆర్థిక సమస్య ఉంటే, దాన్ని పరిష్కరించవచ్చట. మీరు తరచుగా ఆర్థిక సంక్షోభంలో ఉంటే, కోలుకోవడం కష్టంగా ఉందని అనిపించినప్పుడు ఈ మిరియాలను వాడితే సరిపోతుందట.
అప్పు, ఆర్థిక పరిస్థితి లేదా ఇంట్లో నిరంతరం డబ్బు కొరత ఉంటే, మీ దిండు కింద మిరియాలు పెట్టుకుని నిద్రపోవాలట. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. చాలా మంది జీవితంలో తాము ఎంత కష్టపడినా విజయం సాధించలేకపోతున్నాం అని ఫీలౌతూ ఉంటారు. అలాంటివారు మిరియాలు వాడితే చాలు. చదువులో, ఉద్యోగంలో ఎందులో సక్సెస్ రావడం లేదని భావించినా కూడా మిరియాలు వాడాలి. దీని కోసం, మన మీరు దిండు కింద మిరియాలు పెట్టుకుని నిద్రపోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడతారట. అదృష్టం పెరుగుతుందని, లక్ష్యాలను సాధించగలరని చెబుతున్నారు. ఒక పని ముందు మనం చాలాసార్లు ఆలోచిస్తాము. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు భయం, ఆందోళన మనపై ప్రభావం చూపుతాయట అదేవిధంగా, నిద్రపోతున్నప్పుడు, ఆ చర్య గురించి మనకు చెడు కలలు రావచ్చు. మిరియాలు శనిదేవుడితో సంబంధం కలిగి ఉంటాయని,కాబట్టి మీరు శనిదేవుని ఆశీస్సులు పొందితే, మీరు మనశ్శాంతిని పొందవచ్చని చెబుతున్నారు.
Astrology Remedies: దిండు కింద మిరియాలు పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Astrology Remedies: పడుకునేటప్పుడు దిండు కింద కొన్ని మిరియాలు పెట్టుకుని పడుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

astrology Remedies
Last Updated: 28 Nov 2025, 10:32 AM IST