Site icon HashtagU Telugu

Spirituality: తరచూ పాలు పొంగుతున్నాయా.. అది దీనికి సంగీతమో తెలుసా?

Spirituality

Spirituality

మామూలుగా మనం కొన్ని కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ పాలు పొంగిపోవడం జరుగుతూ ఉంటుంది. స్టవ్ పై పాలు పెట్టి ఏదో ఒక వర్క్ చేసుకోవడం లేదంటే దాని మీద ధ్యాస లేకపోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు పాలు పొంగిపోతూ ఉంటాయి. ఇలా తరచుగా కొన్ని కొన్ని సార్లు పాలు పొంగి ఆ పాలన్ని నేలపాలు అవుతూ ఉంటాయి. ఇలా పాలు పొంగిపోవడం కొందరు మంచిదే అంటే మరి కొందరు మాత్రం అలా పాలు తరచుగా పొంగిపోవడం అస్సలు మంచిది కాదని అంటూ ఉంటారు. మరి నిజానికి పాలు పొంగిపోవడం మంచిదేనా అలా జరిగితే ఏం జరుగుతుందో అది దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

గృహప్రవేశ కార్యక్రమంలో మొదటిగా పాలను పొంగించే ఆచారం ఉంది. అందులో భాగంగా పాలు పొంగుతాయి. అయితే కొంతమంది పాలు తూర్పు వైపు పొంగిస్తారు. పితృదోషం వల్ల ఈ భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు దిక్కును శుభసూచికగా భావిస్తారు. ఈ విధంగా చేస్తే అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కలుగుతాయని భావిస్తారు. కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు తద్వారా అదృష్టాన్ని, అనుకూలతని పొందేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కాబట్టి తూర్పు వైపు పాలని చిందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం. అలాగే పెళ్లిరోజుకు ముందు గాని లేదా వెనుకగాని పాలు చిందటాన్ని శుభపరిణామంగా భావించరు.

రాబోయే దురదృష్ట సంఘటనలకు సంకేతంగా పాలు చిందడాన్ని భావిస్తారు. కాబట్టి, మరుగుతున్న పాలు చిందడం వల్ల కలిగే శకునాల గురించి తెలుసుకునేటప్పుడు మీకు రెండు వైపుల కథలు వినబడవచ్చు. అయితే, సాధారణంగా, పాలు చిందడం శుభపరిణామాలకి సంకేతంగానే చెప్పుకుంటారు. పాలు, సమృద్ధికి, సంపదకు సంకేతం. అలాగే శుద్ధికి ప్రతీక పాలు. పవిత్రమైన ఆవు పాలు హిందూ ధర్మంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. యజ్ఞాలలో అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవుపాలతో తయారు చేసిన నేతిని వాడతారు. పాలు చిందడం అన్నది అదృష్టానికి అలాగే సంపదకు చిహ్నంగా నమ్ముతారు. అంత మాత్రాన మీరు ఒక్క రోజులో ధనవంతులు అయిపోతారని కాదు. కాకపోతే, అదృష్టం మీ వెంట ఉందని సంకేతం. అలాగే మీ ప్రయత్నాలకు తగిన అనుకూలమైన ఫలితం వస్తుందని నమ్మకం. కొంత ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచిక. పాలు పొంగితే డబ్బులు పొంగుతాయని అంటారు. అలా మీ అవసరాలకు మించిన ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచికగా పాలు పొంగడాన్ని భావిస్తారు. కాబట్టి పాలు పొంగడం అన్నది అశుభం కాదు శుభ సూచనమే అని అంటున్నారు పండితులు.