Tirumala: శాస్త్రోక్తంగా ప‌త్ర పుష్పయాగం

తిరుమల తిరుపతి అనగానే వేంకటేశ్వరస్వామి మాత్రమే కాదు.. అక్కడ జరిగే నిత్య పూజలూ భక్తులను విశేషంగా అలరిస్తుంటాయి.

  • Written By:
  • Publish Date - May 16, 2022 / 07:53 PM IST

తిరుమల తిరుపతి అనగానే వేంకటేశ్వరస్వామి మాత్రమే కాదు.. అక్కడ జరిగే నిత్య పూజలూ భక్తులను విశేషంగా అలరిస్తుంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేక పూజ జరుగుతూనే ఉంటుంది. అందుకే శ్రీవారి భక్తులు ఆ పూజ విధానాలను చూస్తూ పరవశించిపోతుంటారు. సోమవారం తిరుప‌తి క‌పిలేశ్వరాల‌యంలో వైశాఖ పౌర్ణమి సంద‌ర్భంగా ప‌త్ర పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం కపిలేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం పుష్ప పత్రయాగ మహోత్సవం చేశారు. చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరం పూలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులను ఇందులో వినియోగించారు.