Site icon HashtagU Telugu

TTD Online Booking: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13న దర్శన టికెట్లు విడుదల

Ttd

Ttd

తిరుపతి ఆలయ దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. ఇప్పుడు భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) రూ. 300 ఆన్‌లైన్ దర్శన టిక్కెట్‌ను ఈ నెల 13న విడుదల చేయనుంది. డిసెంబర్ 16, 31వ తేదీలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఈ టిక్కెట్ల ఆన్ లైన్ కోటాను ఈ నెల 13న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. http://tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్లో ఈ టిక్కెట్లను బుక్ చేస్కోవాలని టీటీడీ తెలిపింది. కాగా, మాండూస్ తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా టీటీడీ ఘాట్ రోడ్లపై ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేదించింది. ఈ నెల 16, 31 తేదీల్లో ఆన్‌లైన్ కోటా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఈ నెల 13న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: Arunachalam: అరుణాచలానికి సమీపంలో ఉన్న కొన్ని ఆలయాలు..!

టీటీడీ ఐటీ విభాగం తాజాగా కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే యాప్‌‌ దాదాపు పూర్తికాగా.. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. టీటీడీ తీసుకొస్తున్న ఈ యాప్‌ ద్వారా పూర్తి సమచారాన్ని పొందొచ్చు. ఇదిలా ఉంటే భక్తులు ప్రస్తుతం దర్శనం, రూమ్‌ బుకింగ్ వంటివి టీటీడీ వెబ్‌సైట్‌లో చేసుకుంటున్నారు. కానీ ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే ఇకపై దర్శనం, గదులు, శ్రీవారి సేవా టికెట్లను యాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు. అలాగే సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు.

Exit mobile version