TTD : తిరుమలలో 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

Published By: HashtagU Telugu Desk
Tirumala Srivaru

Tirumala Srivaru

TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వేడుకలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం ఒకటి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు పది రోజులపాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు..

. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు.. కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు..
. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు..
. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.
. భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు..
. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు..
. భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన..
. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు..
. 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది..

కాగా, తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నవంబర్ నెలలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. వైకుంఠ ఏకాదశికి కావాల్సిన పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌ల నియామకం, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర అంశాలపై ఆయన చర్చించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీటీడీ పాలకమండలి సమావేశమై వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులకు పలు సూచనలు చేసింది.

Read Also: Rahul Gandhi : మోదీ ప్రభుత్వం యువత బొటనవేలును కోరుతోంది..

  Last Updated: 14 Dec 2024, 05:03 PM IST