Site icon HashtagU Telugu

TTD: గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు.. కార్యక్రమ వివరాలు ఇవే

Bomb Threats In Tirumala

Bomb Threats In Tirumala

TTD: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.  మార్చి 1, 8, 15, 29వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.  మార్చి 8న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్ర‌హించ‌నున్నారు.

మార్చి 16న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిస్తారు. – మార్చి 25న పౌర్ణమి మ‌రియు పంగుణి ఉత్తర ఉత్సవం సందర్భంగా రాత్రి 9.30 గంటలకు స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తారు.