Site icon HashtagU Telugu

Pradosh Vrat : ఏప్రిల్ 3న సోమ ప్రదోష వ్రతం..ఆరోజున శివుడిని ఇలా పూజిస్తే కష్టాల నుంచి గట్టెక్కుతారు

Siva Rathri

Siva Rathri

చైత్ర మాసంలోని శుక్ల పక్ష ప్రదోషం (Pradosh Vrat) ఈసారి ఏప్రిల్ 3, 2023 సోమవారం నాడు వస్తోంది. ఈసారి సోమ ప్రదోషం శుభపరిణామంగా మారుతోంది. ప్రదోషం, సోమవారాలు రెండూ శివునికి అంకితం చేయబడ్డాయి. కావున ఈ రోజున చేసే అన్ని ఉపవాసాలు, పుణ్యాలు అనేక విధాల ఫలితాలను పొందుతాయి. ఈ రోజున శివున్ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తుంటారు.

పంచాంగ్ ప్రకారం, ప్రదోష తిథి 3 ఏప్రిల్ 2023, సోమవారం ఉదయం 6.24 గంటలకు ప్రారంభమవుతుంది. ముగింపు మరుసటి రోజు అంటే 4 ఏప్రిల్ 2023 మంగళవారం ఉదయం 8.05 గంటలకు. ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 6.40 గంటల నుంచి రాత్రి 8.58 గంటల వరకు పూజలకు అనుకూల సమయం. ఇది కాకుండా, మీరు ఇతర పవిత్రమైన చోఘడిలలో కూడా శివుడిని పూజించవచ్చు.

ప్రదోష నాడు పొద్దున్నే లేచి, స్నానం చేసిన తర్వాత గణేశుడిని, శివుడిని, పార్వతిని పూజించండి. శివలింగంపై గంగాజలంతో అభిషేకం నిర్వహించండి. పూలు, దండలు, అగరుబత్తీలు, దేశీ నెయ్యి దీపాలు సమర్పించండి. శివుడిని భక్తితో పూజించండి. అనంతరం శివుని పంచాక్షరీ మంత్రాన్ని ‘ఓం నమః శివాయ’ కనీసం 108 సార్లు జపించండి. ఈ విధంగా చేస్తే మీ ఆరాధన సంపూర్ణమవుతుంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే శివుడిని పూజించాలనుకుంటే, ‘ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం, ఉర్వారుకమివ్ బంధనన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్’ అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి.
మీరు కూడా ప్రదోష వ్రతం పాటిస్తున్నట్లయితే, మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇవి క్రింది విధంగా ఉన్నాయి

ప్రదోష వ్రతం సమయంలో ఆహారం తీసుకోకూడదు. పండ్లు మాత్రమే తినాలి. మీరు ఉపవాసం చేయలేకపోతే, పేదలకు దానం చేయడి. దీని నుండి కూడా మీకు ఉపవాస పుణ్యం లభిస్తుంది.

-ప్రదోష వ్రతం చేసేప్పుడు సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని అనుసరించండి. మీ మనసులో ఏ స్త్రీ పట్ల మలినమైన భావాలు రానివ్వకండి. ఇలా చేస్తే మీకు వ్రతం చేసిన పుణ్యం కూడా లభించదు.
-ఈ రోజున గుడ్లు, మాంసం, మద్యం, సిగరెట్, పొగాకు, గుట్కా మొదలైన అన్ని రకాల మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.

Exit mobile version