Solar Eclipse : రేపు (అక్టోబరు 2) బుధవారం సూర్య గ్రహణం (Solar Eclipse) ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణం దాదాపు ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తుంది. అలాగే ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం కూడా. ఈ సూర్య గ్రహణంలో చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చినప్పుడు ఒక రింగ్ మాదిరిగా సూర్యుడు కనిపిస్తాడు. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇలాంటి సూర్య గ్రహణం మహాభారత కాలం నాడు ఏర్పడిందని, మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుందని చెప్తున్నారు. కనుక ఈ సూర్య గ్రహణం చాలా శక్తివంతమైనదని, ప్రభావ వంతమైనదని పండితులు చెపుతున్నారు. ఈ గ్రహణ సమయం మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని.. గ్రహణం సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని లేకుంటే జీవితంలో సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో సూర్య గ్రహణ కాలం రాత్రి కావటంతో ఇది కనిపించదు. ఇది రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై గురువారం తెల్లవారుజామున 3:17 గంటల వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 6 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది.
ఇక ఈ సూర్యగ్రహణం బ్రెజిల్, కుక్ దీవులు, చిలీ, పెరూ, అర్జెంటీనా, మెక్సికో, హోనోలులు, ఫిజి, ఉరుగ్వే, అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆర్కిటిక్, బ్యూనస్ ఎయిర్స్ వంటి ఇతర దేశాలలో, బెకా ద్వీపం మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తుంది. సూర్య గ్రహణ సమయంలో తినడం, త్రాగడం చేయొద్దని అంటున్నారు. అంతే కాదు గ్రహణ సమయంలో నిద్రపోవడం కూడా చేయొద్దని, నిద్రిస్తున్న వ్యక్తిపై గ్రహణం అననుకూల ప్రభావాన్ని చూపిస్తుందని , కనుక గ్రహణ సమయంలో నిద్రపోవడం అస్సలు చెయ్యొద్దంటున్నారు.
ఇంకేమిమి చేయొద్దంటే..
గ్రహణ సమయంలో పూజ చేయడం చేయొద్దని , కొత్త పనులు అస్సలు చేయకుండా ఉండాలని, గ్రహణం సమయంలో ఏ పని ప్రారంభించినా అసంపూర్తిగా మిగిలిపోతుందని నమ్ముతారు. గ్రహణ సమయంలో గర్భిణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గ్రహణాన్ని వీక్షించకుండా ఇంట్లోనే ఉండాలి. ఈ కాలంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. సూర్యగ్రహణం సమయంలో ధ్యానం, ప్రార్థన కోసం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే ధ్యానం మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తుందని చెపుతున్నారు. సూర్యగ్రహణం సమయంలో తినడం లేదా త్రాగడం చేయొద్దంటున్నారు. గ్రహణం సమయంలో ఎవరు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే వారికి అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Read Also : Ghata Sthapana: దుర్గమ్మ విగ్రహం పెడుతున్నప్పుడు ఈ 7 తప్పులు చేయకండి!