Sneezing: తుమ్ము మంచిదే కానీ.. ఆ షరతులు వర్తిస్తాయి?

సాధారణంగా మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్లే ముందు ఎవరైనా తుమ్మితే అపశకునం అని వెళ్లే పని సరిగా జరగదని ఫీల్ అవుతూ ఉంటారు. వెళ్లే పనిలో ఆటంకాలు ఎ

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 09:30 PM IST

సాధారణంగా మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్లే ముందు ఎవరైనా తుమ్మితే అపశకునం అని వెళ్లే పని సరిగా జరగదని ఫీల్ అవుతూ ఉంటారు. వెళ్లే పనిలో ఆటంకాలు ఎదురవుతాయని అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పటినుంచో ఈ విషయాన్ని అలాగే పాటిస్తూ వస్తున్నారు. దాని వెనుక ఉన్న అసలు నిజం ఏంటి అనేది చాలామందికి తెలియదు. మాములుగా ఒక తుమ్ము తుమ్మితే అది కీడు సూచిస్తుంది. రెండు తుమ్ములు తుమ్మితే ఏ పనిపై వెళుతున్నారో ఆ పని పూర్తైపోతుందట.

రెండు కంటె ఎక్కువ తుమ్ములు తుమ్మితే అస్సలు బయలుదేరడం కూడా మంచిది కాదు. చేతిలో ఇనుము, వెండి పట్టుకున్న వారు తుమ్మితే వెళ్లిన పని పూర్తికాదు. అలాగే కంచు, రాగి పట్టుకుని ఉండగా తుమ్మితే ఆ సమయంలో ఏ పనిపై బయలుదేరి వెళ్లినా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తైపోతుందట. ఉదయం లేవగానే తుమ్మితే శుభం నీటిదగ్గర, ఎవరితోనైనా గొడవ జరుగుతున్నప్పుడు, పదిమందిలో తుమ్మిదే అవమానం ఎదుర్కోవడంతో పాటు జీవిత భాగస్వామికి కీడు జరుగుతుంది.

పసిపిల్లలు, ఐదేళ్ల లోపువారు, వేశ్య, బాలింతరాలు తుమ్మితే అంతా మంచే జరుగుతుంది. అలాగే అంగవైకల్యం ఉన్నవారు తుమ్మిన తర్వాత బయలుదేరితే ఏ పని అయినా పూర్తైపోతుంది. తమ్ము వినడమే కాదు ప్రయాణం చేసేవారు కూడా తుమ్ముతూ ప్రయాణం చేయరాదు. ముత్తైదువు, విధవ, గుడ్డిది, బిడ్డలు లేని స్త్రీ తుమ్మినపుడు ప్రయాణం చేస్తే మరణం సంభవిస్తుందట. కుటిల స్వభావం ఉన్న స్త్రీ, మూగది, అంగవైకల్యం ఉన్న స్త్రీ తుమ్మితే ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. లేదంటే కష్టాలు తప్పవట. అదేవిధంగా నాలుగు కాళ్ల జంతువు ఎదురైనా, తుమ్మినా మంచిది కాదు. ప్రయాణం చేయడానికి సాహసించరాదు. ఎవరైనా తుమ్మినపుడు బంగారం కానీ, ఆడవారి నాట్య భంగిమ, తాంబూలం వేసుకునే వారి ముఖం చేస్తే శుభం జరుగుతుంది.