Site icon HashtagU Telugu

Money: చేతిలో డబ్బులు నిలవడం లేదా.. మట్టి కలశంతో ఇలా చేయాల్సిందే?

Money

Money

ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కదానికే డబ్బులు ఉండాల్సిందే. అంతే కాకుండా ఆ ప్రస్తుతం రోజుల్లో డబ్బులు చూసి మర్యాద ఇస్తున్నారు. డబ్బు లేకపోతే మనిషిని కనీసం మనిషిగా కూడా చూడడం లేదు. ప్రస్తుతం రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా మంది డబ్బులు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లైఫ్ లో మంచిగా ఎదగాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదు అని బాధపడుతూ ఉంటారు. సంపాదించిన డబ్బు మిగలకపోగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు.

మరి సంపాదించిన డబ్బును ఎక్కువగా ఖర్చవ్వకుండా చేతిలో డబ్బులు నిలవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ఒక చిన్న మట్టి కుండ తీసుకోవాలి. ఇందులో రూపాయి నాణాలు 5 ఉంచాలి. వాటితో పాటుగా బియ్యం, గోధుమలు, బార్లీ వంటి ఇతర ధాన్యంతో కలశం నింపాలి. ఈ కలశాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి దారంతో కట్టి మూసెయ్యాలి. ఇప్పుడు దీన్ని లక్ష్మీ పూజలో ఉంచాలి. పూజ తర్వాత ఈ కలశాన్ని డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రోజులు గడిచేకొద్ది కాలం కలిసి రావచ్చు. ఈ పరిహారంతో పాటు మరికొన్ని పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి..

కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని దారంతో కట్టాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయను లక్ష్మీ పూజలో ఉంచి పూజ చెయ్యాలి. ఆ తర్వాత దాన్ని డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అదేవిధంగా శుక్రవారం లక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూజ చేసుకుని పసుపు వేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటికి రమ్మని ఆహ్వానించాలి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి. గులాబి పువ్వులు, గులాబి మాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా వరుసగా 11 శుక్రవారాల పాటు క్రమంతప్పకుండా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటుండదు.