Site icon HashtagU Telugu

Mistakes: మీ ఇంట్లోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయాల్సిందే!

Mixcollage 02 Sep 2024 08 34 Pm 6635

Mixcollage 02 Sep 2024 08 34 Pm 6635

మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే చాలా రకాల సమస్యలకు కారణం అవుతూ ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ చిన్న తప్పులే కుటుంబంలో శాంతి, ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయట. మరి మనం చేసే ఎలాంటి తప్పులు ఇంట్లో శాంతిని దూరం చేస్తాయో, ఎలాంటి పనులు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కుటుంబంలో ఎవరూ కూడా సూర్యోదయం అయిన తర్వాత నిద్రపోకూడదు. ఇలా చేస్తే అది ఆ కుటుంబంలో ప్రతికూల శక్తులను పెంచుతుంది. అలాగే కలహాలను కూడా పెంచుతుంది. ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతుంది.

అదేవిధంగా ఎప్పుడూ మీ పూజ గదిలోని విగ్రహాలు అలాగే చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదట. పూజ గదిలో విలువైన వస్తువులను దాచడం వల్ల మీ ఇంటి యొక్క సంపద తగ్గుతుందట. ముఖ్యంగా ఉత్తరాన ఎదురుగా ఉంటే అది చాలా నష్టం కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే ఒకవేళ మీ ఇంట్లో ప్రతికూల శక్తులు కనుక ఉంటే వాటిని నివారించడం కోసం మీ పూజ గదిలో నెయ్యి దీపాన్ని వెలిగించాలట. ఉదయం సాయంత్రం ఇంట్లోని దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లోకి దేవతలు వచ్చి వారి అనుగ్రహం కలుగుతుందట. ఒకవేళ మీ ఇంట్లో వాస్తు ప్రకారం గా ఏదైనా దోషం ఉంటే అది మీ కుటుంబ పెద్దపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుందట.

కాబట్టి అలాంటి వాస్తు దోషాలు ఏవి కలగకుండా ఉండాలి అంతే ఎల్లప్పుడూ సాత్ముఖి రుద్రాక్షను ధరించాలట. ఇది వారికి దీర్ఘాయువును ఆరోగ్యాన్ని పెంచుతుందట. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం దక్షిణ వైపుకు ఉంటే అది కుటుంబ అధిపతికి ప్రమాదమట. ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం గణపతి ఇంటి తలుపు పై వేలాడదీయడం మంచిదని చెబుతున్నారు. ఎప్పుడు కూడా తినేటప్పుడు మాట్లాడడం గొడవలు పడడం లాంటివి అస్సలు చేయకూడదట.

ఇలా చేస్తే అది ఆర్థిక పరిస్థితులను నాశనం చేస్తుందని చెబుతున్నారు. స్పష్టమైన కారణం లేకుండా మీరు మీ ఇంట్లోని వారు సమస్యలను ఎదుర్కొంటుంటే అది వాస్తు లోపం కారణం కావచ్చని చెబుతున్నారు. అలాంటప్పుడు మీరు మీ ఇంటి పై స్వస్తిక్ అలాగే ఓం చిహ్నన్ని ఉంచాలట. ఇది గీయడానికి పసుపు కుంకుమ లేదా గంధం ఉపయోగించవచ్చట. ఇంట్లో సాలె గూడెలు ఎక్కువగా ఉంటే వెంటనే వాటిని తీసివేయాలని బూజు దులపాలని చెబుతున్నారు.. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు దూరమవ్వడంతోపాటు ఆ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందట.