Vastu Tips: పెళ్లయిన స్త్రీ ఈ దిక్కున కాళ్లు పెట్టి పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

పెళ్లి అయినా ప్రతి ఒక్క మహిళ కూడా భర్త పిల్లలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలి అని కోరుకుంటూ

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 06:30 AM IST

పెళ్లి అయినా ప్రతి ఒక్క మహిళ కూడా భర్త పిల్లలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలి అని కోరుకుంటూ ఉంటుంది. అయితే సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మహిళలు కొన్ని రకాల వాస్తు చేసుకోవాలని పాటిస్తే ఎంతో మంచిది. మరి మహిళలు ఎటువంటి వాస్తు చిట్కాలను పాటించడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సంతోషకరమైన వైవాహిక జీవితంలో ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సింది వాస్తు ప్రకారం గా అప్పటికి గదిలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అలాగే పడక గదిలో మంచం అలాగే పడుకునే దిశ, పడక గదిలోని రంగుల ఎంపిక ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాస్తు ప్రకారం గా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

పడక గదిలోని వాస్తు వాతావరణం ఆ దంపతుల బంధాన్ని బలోపేతం చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా వాస్తు ప్రకారం గా సరైన నిద్ర అవసరం. ఒకవేళ ఆ దంపతులు ఆ ఇంటి యజమాని అయితే పడకగది నైరుతి దిశలో ఉండాలి. ఒకవేళ కుటుంబంతో కలిపి ఉంటే నార్త్ లేదా వెస్ట్ లో ఉండాలి. వివాహిత జంట ఎప్పుడూ కూడా ఈశాన్య పడగలిగే దూరంగా ఉండాలి. వాస్తు ప్రకారంగా పెళ్లైన స్త్రీలు ఏ దిక్కున నిద్రించాలి అన్న విషయాన్ని వస్తే.. స్త్రీలు ఎప్పుడు కూడా వారి పాదాలను దక్షిణం వైపు పెట్టి నిద్రించకూడదు. దక్షిణ దిశను యమరాజ దిశగా భావిస్తారు కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో శక్తి నశిస్తుంది.

అలాగే ఇంట్లో మహిళలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు కాబట్టి స్త్రీలు నిద్రించే ఇతర దిక్కుల గురించి కూడా తెలుసుకోవడం మంచిది. స్త్రీలు ఉత్తర దిశలో పడుకోవడం వల్ల ఆర్థిక జీవితం దెబ్బతినే అవకాశం ఉంటుంది. పెళ్లయిన స్త్రీలు పడుకునేటప్పుడు ఉత్తరం పడమర మధ్య పాదాలు పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఉత్తరం, పడమర దిశల మధ్య ఖాళీని పశ్చిమ కోణం అంటారు. ఈ దిశలో నిద్రించడం వల్ల స్త్రీలు తమ సంబంధం నుండి విడిపోవడం గురించి ఆలోచిస్తారని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, పెళ్లికాని అమ్మాయిలు కూడా పాదాలను నైరుతి దిశలో ఉంచి నిద్రించకూడదు. అమ్మాయిలు ఉత్తర దిశలో పాదాలను ఉంచి నిద్రించడం ద్వారా త్వరగా వివాహం జరుగుతుంది.