Shani Effects: శని చిన్నచూపు చూస్తున్నాడని చెప్పే ఆరు సంకేతాలు ఇవే!

Shani Effects: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనీశ్వరుని న్యాయ దేవునిగా చెబుతూ ఉంటారు. శని దేవుడు కర్మల ఆధారంగా శుభాకాంక్షలు ఫలితాలను ఇస్తాడని, మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలను, చెడు పనులు చేసే వారికి అశుభ ఫలితాలను ఇస్తాడు.

  • Written By:
  • Publish Date - October 15, 2022 / 06:30 AM IST

Shani Effects: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనీశ్వరుని న్యాయ దేవునిగా చెబుతూ ఉంటారు. శని దేవుడు కర్మల ఆధారంగా శుభాకాంక్షలు ఫలితాలను ఇస్తాడని, మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలను, చెడు పనులు చేసే వారికి అశుభ ఫలితాలను ఇస్తాడు. శని దేవుని వక్ర దృష్టితో ఏ వ్యక్తి చూసినా కూడా వారికి చెడు కాలం మొదలవుతుంది అని చెబుతూ ఉంటారు. శనిగ్రహం మొత్తం రెండున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. శని అశుభంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో తెలుసుకుందాం.. ఆకస్మికంగా ఆర్థిక నష్టం, వ్యాపారంలో నష్టపోవడం , ఇలాంటివి అశుభ ఫలితాలుగా చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా కారణం లేకుండా అనవసరంగా మాటలు కూడా పడాల్సిన పరిస్థితిలో వస్తాయి.
శనిగ్రహం ఆగ్రహించడం మొదలైనప్పుడు వ్యక్తి మోసంలో చిక్కుకోవడంతో పాటు పరువు, గౌరవం దిగజారడం. శని కోపం పెరగడం మొదలైతే, చెడు అలవాట్లు, దొంగతనం, జూదం, బెట్టింగ్ వంటి దుర్గుణాల పట్ల ఆకర్షితులు అవుతారు. దానిని కూడా శని అశుభ ఫలితంగా చెప్పుకోవచ్చు. అలాగే మతపరమైన పని చేయాలని అనిపించదు. శని పట్టి పీడిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నుదురు తేజస్సు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
అలాగే నలుపు రంగు కూడా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని కుక్క కరిచినా లేదా జంతువుల దాడి వల్ల మీరు తీవ్రంగా గాయపడినా అది శనిగ్రహం అశుభ ప్రభావానికి సంకేతంగా చెప్పవచ్చు. ఇక అలాంటప్పుడు శని మహాదశ నుండి తప్పించుకోవడానికి ఇటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని వస్తే..శని శ్రేయస్సు పొందడానికి అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం చేసి, పేదలకు వారి శక్తికి తగినట్లుగాబట్టలు,ఆహారాన్ని దానం చేయండి. అదేవిధంగా శనివారం నాడు అశ్వథ వృక్షానికి నీటిని నైవేద్యంగా పెట్టడం వల్ల శని గ్రహ దోషం త్వరగా పోతుంది.