కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల కేసు(Dharmasthala Case)లో ఓ కీలక ముందడుగు పడింది. నేత్రావతి నది సమీపంలో ఒక ప్రాంతంలో మానవ అవశేషాలు (Human Remains) బయటపడ్డాయి. వీటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి తదుపరి విశ్లేషణల కోసం ల్యాబ్‌కు పంపింది. ఈ పరిణామం దశాబ్దాలుగా అంతుచిక్కకుండా ఉన్న ఈ కేసులో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఈ కేసులో ప్రధానంగా గతంలో ధర్మస్థల ఆలయంలో శానిటరీ వర్కర్‌గా పనిచేసిన వ్యక్తి ఇచ్చిన సంచలన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
అసలు ధర్మస్థల కేసు దేని గురించి?
ఈ కేసు సుమారు 1995 నుండి 2014 మధ్య కాలంలో ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో జరిగిన అనేక అనుమానాస్పద మహిళల మరణాలు, అదృశ్యాలకు సంబంధించినది. ఈ సంఘటనలన్నీ నిగూఢంగా ఉండి, స్థానికుల్లో తీవ్ర భయాందోళనలను సృష్టించాయి. అప్పట్లో ఈ కేసులను సరిగా దర్యాప్తు చేయలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఒక మాజీ శానిటరీ వర్కర్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది.
Malegaon Bomb Blast Case Verdict : ఆ ఆరుగురిని చంపింది ఎవరు? – అసదుద్దీన్
మాజీ శానిటరీ వర్కర్‌గా పనిచేసిన వ్యక్తి తాను 1995-2014 మధ్య కాలంలో వందలాది మహిళల శవాలను పాతిపెట్టానని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారుల ఎదుట సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు అతనిని తీసుకెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. అతను మొత్తం 13 చోట్లను గుర్తించగా, తాజాగా ఆరో ప్రాంతంలో ఈ మానవ అవశేషాలు బయటపడ్డాయి.
Jagan : మేమూ హత్యా రాజకీయాలు ప్రారంభిస్తే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతికుంటాయా? – జగన్
ఈ మానవ అవశేషాల ఫోరెన్సిక్ నివేదిక.. DNA విశ్లేషణలు ఈ కేసులో మరింత స్పష్టతను ఇస్తాయని భావిస్తున్నారు. ఈ తీగ లాగితే మరెన్ని నిజాలు బయటపడతాయో, ఎన్ని దశాబ్దాల నాటి రహస్యాలు వెలుగు చూస్తాయో అని కర్ణాటక ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో న్యాయం జరగాలని బాధితుల కుటుంబాలు ఆశిస్తున్నాయి.