Site icon HashtagU Telugu

Sindhur: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

Mixcollage 30 Jun 2024 08 56 Am 6640

Mixcollage 30 Jun 2024 08 56 Am 6640

హిందూ మతంలో కుంకుమకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎటువంటి శుభకార్యాలు మొదలుపెట్టిన కూడా కుంకుమను మొదట తప్పకుండా వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా దేవుళ్ళ పూజలో కూడా ఈ కుంకుమను ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా వివాహిత స్త్రీలు నుదుటిపై అలాగే పాపిట్లో కుంకుమను పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పూజ నుండి దేవుడి వరకు సాంకేతిక విషయాల వరకు కుంకుమను ఉపయోగిస్తారు. కుంకుమను దాదాపు అన్ని దేవుడి పూజల్లో ఉపయోగిస్తారు.

ఆరెంజ్ కుంకుమను ప్రత్యేకంగా హనుమంతుని పూజకు ఉపయోగిస్తారు. అయితే ఈ కుంకమతో మన ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తరచూ ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు హనుమంతుడికి ఐదు మంగళవారాలు ,ఐదు శనివారాలు మల్లెపూల నూనె, కుంకుమను సమర్పించాలి. అలాగే బెల్లం, బెల్లం ప్రసాదాలు కూడా పంచాలి. ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.

అదేవిధంగా మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే ప్రతిరోజు ఉదయాన్నే తలుపు తెరవాలి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉండటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీని వల్ల లక్ష్మి అనుగ్రహం మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటి ప్రధాన ద్వారం వద్ద గడపకు కుంకుమ బొట్లు పెట్టాలి. అదేవిధంగా గుమ్మానికి ఎదురుగా గణేశు విగ్రహాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు కొబ్బరికాయకు కుంకుమ రాసిఎరుపు రంగు బట్టలో కట్టాలి. తర్వాత లక్ష్మి దేవిని పూజించాలి. ఈ కొబ్బరి కాయను ఒక ప్రదేశంలో లేదా అరలలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది.