మామూలుగా దీపారాధన మట్టి ప్రమిదలతో పాటు ఇత్తడి స్త్రీలు లేదంటే రాగి ఇంకా కొంచెం డబ్బు ఉన్నవారు వెండి ప్రమిదలతో దీపారాధన చేస్తూ ఉంటారు. కొంతమంది కంచు ప్రమిదలతో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. వెండి ప్రముదలతో పూజ చేసేవారు చాలా తక్కువగా ఉంటారని చెప్పాలి. ఇలా ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు స్వామివారి ముందు వివిధ రకాల ప్రమిదలలో దీపారాధన చేస్తుంటాము అయితే వెండి ప్రమిదలలో ఏ దేవుడి ముందు దీపం వెలిగించి దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆది దేవుడు అయిన విఘ్నేశ్వరుడి ముందు వెండి దీపాలను వెలిగించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయట. అయితే నెయ్యితో మాత్రమే దీపారాధన చేయాలని చెబుతున్నారు. అలాగే సరస్వతి అమ్మవారి ముందు వెండి ప్రమిదలలో నెయ్యి వేసి దీపారాధన చేయటం వల్ల అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుందట. లక్ష్మీదేవి చిత్రపటం ముందు వెండి కుందిలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయట. ఇక చంద్రుడికి వెండి కుందిలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల మనలో స్థిరత్వం కలుగుతుందని చెబుతున్నారు. శనివారం రోజు వెండి ప్రమిదలలో నవగ్రహాలకు దీపారాధన చేయడం వల్ల గ్రహ దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయట.
ఇలా ఒక్కో దేవుడు ముందు వెండి ప్రమిదలను వెలిగించడం వల్ల ఒక్కో విధమైనటువంటి ఫలితం కలుగుతుందట. అయితే తప్పనిసరిగా వెండి దీపాలలోనే పూజ చేయాలన్న నియమం ఏమాత్రం లేదని, ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు స్వామి వారి దేవుడి ముందు ఇత్తడి కంచు లేదా మట్టి ప్రమిదలను కూడా వెలిగించి పూజ చేయవచ్చు అని చెబుతున్నారు పండితులు. అయితే ఎలాంటి వాటిలో చేసిన కూడా దీపం కింద తప్పనిసరిగా చిన్న ప్లేటు లాంటిది కానీ ఏదో ఒకటి పెట్టాలని చెబుతున్నారు. లేదంటే రావి ఆకులపై కూడా పెట్టవచ్చు అని చెబుతున్నారు.