Site icon HashtagU Telugu

Dreams Meaning: మీకు కూడా అలాంటి కలలు వస్తున్నాయా.. అయితే మీకు త్వరలో పెళ్లిఅవ్వడం ఖాయం?

Mixcollage 15 Dec 2023 03 21 Pm 4755

Mixcollage 15 Dec 2023 03 21 Pm 4755

మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అన్నది సహజం. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరి కొన్ని పీడకలలు మరికొన్ని చెడ్డ కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే చాలామంది కొన్ని రకాల కలలు వచ్చినప్పుడు భయపడడం ఆందోళన చెందడం లాంటివి చేస్తూ ఉంటారు. స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అయితే కలలో మనకు కనిపించే కొన్ని రకాల సంఘటనలు కొన్ని రకాల సంకేతాలకు అర్థం. మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు వివాహానికి సంబంధించిన కలలు కూడా వస్తూ ఉంటాయి.

మనకు పెళ్లి అయినట్టు కలలో రావడం కుటుంబంలోని వారికి పెళ్లి జరిగినట్టు కలలో వస్తూ ఉంటాయి. అలాగే కలలో డాన్స్ చేస్తున్నట్టు కనుక మీకు కల వస్తే మీకు త్వరలోనే వివాహం నిశ్చయమవుతుందని అర్థం. కలలో అందమైన ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు కనిపిస్తే మీకు అందమైన భాగస్వామి లభిస్తాడని అర్థం. ఎవరైనా మీకు నగలు ఇచ్చినట్లు కల వస్తే ఆ నగలు ఇచ్చిన వ్యక్తికి త్వరలో ఒక సంపన్న కుటుంబంలో వివాహం అవుతుందని అర్థం. మీ కలలో జాతర జరుగుతున్నట్టు లేదా మీరు జాతరలో తిరుగుతున్నట్టు కనిపిస్తే త్వరలో మీకు తగిన జీవిత భాగస్వామిని పొందబోతున్నారని సంకేతం. కలలో మీరు గడ్డం పెంచుకొని కనిపిస్తే మీ ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి రాబోతోందని అర్థం

కలలో వజ్రం లేదా వజ్రాలు పొదిగిన అభరణాన్ని ధరించడం చూస్తే అది మంచి సంకేతం కాదు. ఈ కల మీ ఆనందమయమైన వైవాహిక జీవితానికి దిష్టి ఉందని దాన్ని కాపాడుకోవాలని సూచించే కలగా స్వప్నశాస్త్రం చెబుతోంది. కలలో ఉంగరం దరించడం లేదా ఉంగరం కనిపిస్తే త్వరలో చాలా ప్రేమించే భాగస్వామి మీకు లభిస్తారని అర్థం. కొత్త పాదరక్షలు కొంటున్నట్టు కల వస్తే త్వరలోనే మీరు కూడా జత కట్ట బోతున్నారని తెలిపే సంకేతం. కలలో జుట్టు దువ్వుకుంటున్నట్టు కనిపిస్తే అది సాధారణమైన కల కాదు. మిమ్మల్ని కొత్త జీవితానికి సిద్ధం చేయడానికి సంకేతం. అడవిలో నడుస్తున్నట్టు కల వస్తే త్వరలో మీరు ప్రేమలో పడబోతున్నారనేందుకు సూచన. కలలో తల్లిదండ్రులు కలిసి కనిపిస్తే త్వరలో మీకు ఘనంగా వివాహం జరుగుతుందని అర్థం. రైలులో ప్రయాణం చేస్తున్నట్టు కల వస్తే అది మీకు కల్యాణ ఘడియలు మొదలయ్యాయని చెప్పేందుకు సంకేతంగా భావించాలి.