మామూలుగా రాత్రి సమయంలో నిద్ర పోతున్నప్పుడు ఏవేవో కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరికొన్ని పీడ కలలు వస్తూ ఉంటాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ విషయంపై స్పందిస్తూ మనం పడుకునే సమయంలో ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో ఆ విషయానికి సంబంధించిన కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయని తెలిపారు. అయితే కలలో కొన్ని రకాల కలలు వస్తే అది మీకు త్వరలోనే పెళ్లి కాబోతుందనడానికి సంకేతం అని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.. మీరు డాన్స్ చేస్తున్నట్టు మీకు కల వచ్చిందంటే మీకు త్వరలోనే వివాహం నిశ్చయం అవుతుందని అర్థం. కలలో అందమైన పనితనం కలిగిన, ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు కనిపిస్తే మీకు అందమైన భాగస్వామి లభిస్తాడని అర్థం.
ఎవరైనా మీకు నగలు ఇచ్చినట్లు కల వస్తే ఆ నగలు ఇచ్చిన వ్యక్తికి త్వరలో ఒక సంపన్న కుటుంబంలో వివాహం అవుతుందని అర్థం. కొత్త పాదరక్షలు కొంటున్నట్టు కల వస్తే త్వరలోనే మీరు కూడా జత కట్ట బోతున్నారని తెలిపే సంకేతం. కలలో జుట్టు దువ్వుకుంటున్నట్లు కనిపిస్తే అది సాధారణమైన కల కాదు. మిమ్మల్ని కొత్త జీవితానికి సిద్ధం చేయడానికి సంకేతం. అడవిలో నడుస్తున్నట్టు కల వస్తే త్వరలో మీరు కొత్తగా ప్రేమలో పడబోతున్నారని అర్థం. కలలో తల్లిదండ్రులు కలిసి కనిపిస్తే త్వరలో మీకు వివాహం జరుగుతుందని అర్థం. మీ కలలో జాతర జరుగుతున్నట్టు లేదా మీరు జాతరలో తిరుగుతున్నట్టు కనిపిస్తే త్వరలో మీకు తగిన జీవిత భాగస్వామిని పొందబోతున్నారని అర్థం.
కలలో మీరు గడ్డం పెంచుకుని కనిపిస్తే మీ ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి రాబోతోందని అర్థం. కలలో వజ్రం లేదా వజ్రాలు పొదిగిన అభరణాన్ని ధరించడం చూస్తే అది మంచి సంకేతం కాదు. ఈ కల మీ ఆనందమయమైన వైవాహిక జీవితానికి దిష్టి ఉందని దాన్ని కాపాడుకోవాలని సూచించే కలగా స్వప్నశాస్త్రం చెబుతోంది. కలలో ఉంగరం దరించడం లేదా ఉంగరం కనిపిస్తే త్వరలో చాలా ప్రేమించే భాగస్వామి మీకు లభిస్తారని అర్థం. రైలులో ప్రయాణం చేస్తున్నట్టు కల వస్తే అది మీకు కల్యాణ ఘడియలు మొదలయ్యాయని చెప్పేందుకు సంకేతం.