Site icon HashtagU Telugu

Karthika Masam: కార్తీకదీపం మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Usiri Deepam

Usiri Deepam

కార్తీకమాసం వచ్చింది అంటే చాలు ఆలయాలు పండుగ వాతావరణం తలపిస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఆలయాలు కార్తీక దీపాలతో వెలిగిపోతూ ఉంటాయి. అయితే మరొక ఆరు రోజుల్లో కార్తీకమాసం ముగియనుంది. ఇప్పటివరకు మీరు కార్తీక దీపాలను ఉసిరి దీపాలను వెలిగించలేదా అయితే వెంటనే వెలిగించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి. మరి కార్తీక మాసంలో ఉసిరి దీపాలని వెలిగించడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కార్తీక మాసంలో సోమవారం లేదా ఈ మాసంలో ఎప్పుడైనా ఉసిరి దీపాలను వెలిగించడం చాలా మంచిదని చెబుతున్నారు. అయితే ఈ ఉసిరి దీపాలను ఎప్పుడు వెలిగించాలి అన్న సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఈ ఉసిరి దీపాలను సాయంకాలం సమయంలో వెలిగించడం చాలా మంచిదని చెబుతున్నారు. ఈ ఉసిరి దీపాలపై ఒత్తులు పెట్టి దీపం వెలిగించడం చాలా మంచిదని చెబుతున్నారు. ఇందుకు ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఇంకా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే శ్రేష్టం అని చెబుతున్నారు.

ఒకవేళ అవునయి లేదనుకున్న వారు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ, అవిస నూనె కానీ, ఇప్పనూనె కానీ, ఆముదం నూనెతో నైనా దీపాన్ని వెలిగించవచ్చు అని చెబుతున్నారు. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పకుండా దీపదానం చేయాలని పండితులు చెబుతున్నారు. దీప దానం చేసేవారు ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒత్తి వేసి వెలిగించి ఆలయంలో ఉండే బ్రాహ్మణులకు ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. ఆలయంలో పూజలు చేసే పూజారులకు ఇస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు.

అయితే ఈ కార్తీకమాసం 30 రోజులపాటు దీపాలను వెలిగించలేని వారు కార్తీక మాసంలోని శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో తప్పకుండా దీపం పెట్టాలని చెబుతున్నారు. అలాగే కార్తీక మాసంలోనే ఏదైనా సోమవారం అలాగే మిగతా వారాలలో శివాలయాన్ని సందర్శించి ఈ ఉసిరి దీపాలను పెట్టినా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు.