Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

ఆషాడమాసంలో వచ్చే పంచమిని స్కందపంచమి అని పిలుస్తుంటారు. ఈ రోజు భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు. చాలామందికి జాతకంలోదోషాలు వల్ల సరైన సమయంలో వివాహం కాదు.

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 07:00 AM IST

ఆషాడమాసంలో వచ్చే పంచమిని స్కందపంచమి అని పిలుస్తుంటారు. ఈ రోజు భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు. చాలామందికి జాతకంలోదోషాలు వల్ల సరైన సమయంలో వివాహం కాదు. పెళ్లి జరిగినా పిల్లలు కలగరు.అంతేకాదు సరైన ఉద్యోగాలు లేక పెళ్లికాక బాధపడుతుంటారు. దీంతో మానసికంగా క్రుంగిపోతారు. దీనికోసం సోమవారం అద్భుతమైన రోజు స్కందపంచమి. ఈ రోజు సుబ్రమణ్య స్వామిని ఆరాధించినట్లయితే…జంట నాగులను కొలవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం…జాతకంలో రాహువు, కేతు సంబంధించిన దోషాలు ఉన్నట్లయితే…సరైనసమయంలో పిల్లలు పుట్టుకపోవడం, పిల్లలు పుడితే…వారు అవయవ లోపంతో పుడుతుంటారు. ఇలాంటి దోషాలు తొలగిపోవాలంటే..స్కందపంచమి రోజు ఇలా చేయండి.

తెల్లవారుజామున తలస్నానం చేసి…దేవుడి దగ్గర దీపారాధన చేసి…గుడికి వెళ్లి జంట నాగులు ఉన్న ప్రతిమకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర పోయాలి. అంతేకాదు..గంగా జలంతోప్రత్యేకంగా అభిషేకం చేయాలి. సుబ్రమణ్య స్వామికి ఎరుపురంగు అంటే ఎంతో ఇష్టం.

పంచమిరోజున స్వామివారికి ఉపవాసం ఉండాలి. ఉపవాసం లేనివారు ఒంటిపూజ భోజనం లేదా పళ్లు తీసుకుని గానీ ఉండవచ్చు. దీంతోవారి దోషాలు పోతాయి. స్వామి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా స్వామివారికి 11 ప్రదక్షినలు చేయాలి. జంట నాగులను ప్రత్యేకంగా శక్తి కొద్ది అర్చించాలి. సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంలో వెలిశారు. సర్పాలను ఆరాధిస్తే..స్వామి చాలా ఆనందపడతారు. ఇక రాహు, కేతు దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శరవణభవ అనే నామంతో స్వామివారిని ఆరాధించాలి. పంచమి రోజున ఉపవాసం ఉన్న తర్వాత…షష్టి రోజు కూడా కొంత మంది భక్తులు ఆయన్ను ఆరాధిస్తుంటారు.