పరమ పవిత్రమైన కార్తీక మాసంలో చేసేటటువంటి పనులు, పూజలు,దానధర్మాలు విశేషమైన ఫలితాలను అందిస్తాయట. కార్తీక మాసంలో చేసే దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉందని చెబుతున్నారు. అలాగే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతున్నారు. కార్తీకమాసంలో నెల రోజుల పాటు శివాలయంలో కానీ లేదంటే వైష్ణవ ఆలయంలో కానీ వరి పిండితో లేదా గోధుమపిండితో ఆ ప్రమిదను తయారుచేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి బ్రాహ్మణులకు ఎవరైతే దానం చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయట.
దీప దానమునకు అంతటి గొప్ప మహత్యం ఉంది అని చెబుతున్నారు. అదేవిధంగా ఆహారము, వస్తువులు ధన ధాన్యాలు దానం చేసిన కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఈ కార్తీకమాసంలో ప్రతి ఒక్క ఆలయంలో దీపారాధనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దీపాలను లేదంటే దీపారాధన నూనెను ఆయా ఆలయాలకు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి జరుగుతుందట.
వీటితోపాటుగా కార్తీక మాసంలో చేయాల్సిన పనులలో ఉదయాన్నే అనగా సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ఒకటి. నిద్ర లేచిన తర్వాత నది స్నానాలు ఆచరించి, నదులు చెరువులో లేని వారు గంగాజలంతో స్నానము ఆచరించి పరమేశ్వరుడిని శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజించి ఇంటి దగ్గర దీపాలు వెలిగిస్తే తప్పనిసరిగా వారి ఆశీస్సులు కలుగుతాయట. ఇలా కార్తీకమాసంలో చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు.