Site icon HashtagU Telugu

Betel Leaves: హిందూ వివాహాల్లో తమలపాకును వాడడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Betel Leaves

Betel Leaves

హిందూ సంప్రదాయంలో ఎటువంటి శుభకార్యం చేసినా కూడా అందులో తమలపాకులు ఉపయోగించడం అన్నది తప్పనిసరి. పెళ్లిళ్లు పేరంటాలు గృహప్రవేశాలు, దేవుడికి పూజలు, పండుగలు ఇలా ప్రతి ఒక్క శుభకార్యానికి తమలపాకులను ఉపయోగించడం అన్నది తప్పనిసరి. మరియు ముఖ్యంగా మనకు పెళ్లిలో పెళ్లి పందిరి వేయడం మొదలు తిరిగింపుల వరకు ప్రతి ఒక్క విషయంలో తమలపాకును ఉపయోగిస్తూ ఉంటారు. మరి హిందువులు శుభకార్యాలకు ఎందుకు తమలపాకుకు అంత ప్రాధాన్యం ఇస్తారు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాలలో పూలు, అక్షింతలు, ఫలాలు, అద్దం, వస్త్రం, తమలపాకు వక్క దీపం, కుంకుమ భావిస్తారు. కలశ పూజలో సంప్రోక్షణలు చేసే సమయంలో కూడా తమలపాకుని ఉపయోగిస్తారు. పూజలలో, వ్రతాలలో, నోములలో తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. పసుపు గణపతినీ,గౌరీదేవినీ తమలపాకు పైనే అధిష్టింపజేస్తాం. భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. అలాగే దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. క్షీర సాగర మథనం గురించి కూడా వినే ఉంటారు.

స్కాంద పురాణం ప్రకారం క్షీర సాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటి. కొన్ని జానపద కధల ప్రకారం శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని నమ్ముతుంటారు. తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవీ ఉంటారట. అందుకే తమలపాకుకు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏదైనా బంధాన్ని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ తమలపాకును ఉపయోగిస్తే వారికి మంచి జరుగుతుందని నమ్మకమట. అందుకే కచ్చితంగా పెళ్లిలో వీటిని ఉపయోగిస్తారు. హిందూ పెళ్లిలో జిలకర బెల్లం పెడితే దాదాపు పెళ్లి అయిపోయినట్లే. అలాంటి జిలకర బెల్లాన్ని తమిళపాకులో ఉంచే పెడతారు.
ఇక బెంగాళీ పెళ్లిలో అయితే వధువుని ఆమె సోదరులు తీసుకొస్తున్నప్పుడు వధువు తన ముఖాన్ని రెండు తమలపాకులతో కనిపించకుండా చేస్తుంది. తర్వాత వరుడు ముందు కూర్చొని వాటిని తొలగించి పెళ్లి కొడుకును చూస్తుంది. అలా చేస్తే అదృష్టం కలుగుతుందని వారి నమ్మకం.