హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కలు విష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారని తులసి మొక్కను పూజించడం వల్ల వారి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అలాగే తులసి మొక్క అంటే కృష్ణుడికి కూడా ఎంతో ఇష్టం. తులసిమాల అన్న కూడా కృష్ణుడికి ఎంతో ఇష్టం. అందుకే కృష్ణుడు ఆలయాలకు వెళ్ళేటప్పుడు భక్తులు తులసి మాలలు తీసుకుని వెళుతూ ఉంటారు. క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
తులసిని పూజించడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు అంటున్నారు పండితులు. శ్రీకృష్ణునికి తులసి మాల సమర్పించి పూజిస్తే కష్టాలు, బాదలన్నీ పోయి మధురమైన జీవితం పొందుతారని చెబుతున్నారు. కాగా తులసి మొక్క వల్ల కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉండాలని చెబుతూ ఉంటారు. తులసి మొక్క ఇంటి దగ్గరే ఉంటే చుట్టూ వాతావరణంలో ఉండే క్రిములు నశింప చేస్తుంది.
ఇంటి బయట తులసి మొక్క ఉండటం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కూడా ప్రవేశించదు. ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్న తులసి మొక్కను పూజించడంతోపాటు తులసి మాలను శ్రీకృష్ణుడికి సమర్పించి ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించే వారికి లక్ష్మీ అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుడి అనుగ్రహం కూడా కలుగుతుందట.