Site icon HashtagU Telugu

Goddess Lakshmi : ధన లక్ష్మి తలుపుతట్టాలంటే, ఈ విగ్రహం మీ ఇంట్లో ఉండి తీరాల్సిందే…!!

Lakshmidevi

Lakshmidevi

హిందూసంప్రదాయం ప్రకారం…ప్రతి హిందువు ఇంట్లో లక్ష్మీదేవి ఫొటో ఉంటుంది. లక్ష్మీదేవిని ఆనందం, సంపదల దేవతగా పూజిస్తారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండాలని కోరకోవడం సహజం. ప్రతి ఇంట్లోనూ ఏదొక రూపంలో లక్ష్మీ దేవిని కొలుస్తుంటారు. కానీ ఇంట్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలో కొంతమందికి తెలియదు. అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు తెలిసి ఉండాలి. అప్పుడే అమ్మవారు…మీరు చేసిన పూజలకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవిని ఎలా పూజించాలి…ఎలాంటి విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలి తెలుసుకుందాం.

బంగారం లేదా వెండి లక్ష్మీదేవి విగ్రహం ఉన్న ఇల్లు….లక్ష్మీదేవిచే అనుగ్రహించబడుతుంది. బంగారం, వెండి అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే…ప్రతిరోజూ పూజ చేయాలి. అయితే దేవాలయాల్లోనూ…కొంతమంది పూజాగదిలోనూ ఇత్తడి విగ్రహాన్ని కూడా పూజిస్తారు. ఇలా ఇత్తడి విగ్రహన్ని పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, శాంతి కలుగుతుందని నమ్ముతుంటారు.

లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫొటో కానీ ఎలా ఉండాలి…?
లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపువ్వుపై ప్రతిష్ఠిస్తే మంచిది.
విగ్రహం చేతిలో ధన కలశం, తామర పువ్వు, చేతిలో శంఖం, ఒక చేతిలో ఆశీర్వద ముద్ర ఉండాలి.
విగ్రహం చేతికి పెద్ద ఉంగరం ఉండాలి.
లక్ష్మీ విగ్రహంతో పాటు గణపతి విగ్రహం కూడా ఉంటే మంచిది.
ఇంటి గుడిలో శ్రీయంత్రాన్ని అమర్చండి.

Exit mobile version