Hindu Marriage System: శోభనం మంచి ముహూర్తంలో జరగకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

పెళ్లి అంటే అణువణువునా ముహూర్తాలు శుభసమయాలు చూసుకొని అన్ని కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటారు. ఇక పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలలో గర్భధానమ

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 09:30 PM IST

పెళ్లి అంటే అణువణువునా ముహూర్తాలు శుభసమయాలు చూసుకొని అన్ని కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటారు. ఇక పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలలో గర్భధానము లేదా ఫస్ట్ నైట్ లేదా శోభనం కూడా ఒకటి. అయితే పెళ్లి తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఆ తర్వాత పెట్టమని చెబుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఆ వివరాల్లోకి వెళితే.. అప్పట్లో ఎక్కువగా బాల్య వివాహములు జరిగేవి. ఆ దంపతులు యుక్త వయస్కులైన తర్వాత మంచి మహూర్తం చూసి గర్భాదానం లేదా శోభనం ముహూర్తం నిర్ణయించేవారు. గర్భాదానం రోజు ఉదయం పునస్సంధానం చేసేవారు అంటే అగ్ని హోత్రాన్ని వివాహానంతరం, గర్భాదానం రోజున తిరిగి ప్రతిష్టించి హోమం చేసేవారు.

అప్పట్లో బాల్య వివాహం కాబట్టి రజస్వల తర్వాత మరోసారి హోమం చేసి గర్భాదాన ముహూర్తం నిర్ణయించేవారు. ఇప్పుడు పెళ్లిళ్లన్నీ రజస్వల తర్వాతే జరుగుతున్నాయి,కాబట్టి పెళ్లిలో జరిపించే క్రతువు సరిపోతుంది. సాధారణంగా దీనికి మంచి మహూర్తం చూడాలి కానీ పెళ్లైన రెండు మూడు రోజుల్లో జరిపించేస్తున్నారు. ఇంకొందరు పెళ్లికి ముందే తొందరపడుతున్నారు. చాలా వరకు పెళ్లి జరిగిన ఆరోజు రాత్రి ఎక్కువగా శోభనానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అదే కాదండోయ్ ఇంత పవిత్రమైన కార్యాన్ని జరిపించేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.స్త్రీలకు రాజోదర్శనం నుంచి మొదటి పదహారు రాత్రులను ఋతురాత్రులు అంటారు.

అందులో మొదటి నాలుగు రోజులు గర్భాదానం పనికి రాదు. పురుష రాశులైన మేషం, మిధునం, సింహం, తులా, ధనుస్సు, కుంభంలో బృహస్పతి సంచరిస్తున్న సమయంలో గర్భాదాన లగ్నానికి లగ్న, పంచమ, నవమ స్థానాల్లో ఉన్నప్పుడు గర్భాదాన ముహూర్తం నిర్ణయిస్తే పుత్ర సంతానము కలుగుతుందని అంటారు. స్త్రీ రాశులైన వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మకరం, మీన రాశుల్లో పంచమ నవమి స్థానాల్లో బృహస్పతి లేకుండగా గర్భాదాన మహూర్తం నిర్ణయిస్తే స్త్రీ సంతానం కలుగుతుందని చెబుతారు. గర్భాదానం సూర్యోదయ, సూర్యాస్తమయ కాలంలో పగటివేళ పనికిరాదు.

పంచ పర్వములైన కృష్ణాష్టమి, కృష్ణ చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, సంక్రమణ రోజుల్లో, శుక్ల చతుర్దశిలో ఏకాదశి లాంటి వ్రత దినాలు, శ్రాద్ధ దినాల్లో, పాపగ్రహాలతో కూడిన నక్షత్రాల సమయంలో గర్భాదాన ముహూర్తానికి పనికిరాదు.
భార్యభర్తల రాశికి ఎనిమిదో స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు గర్భాదాన ముహూర్తం నిర్ణయించరాదు. ఒకవేళ గర్భాదాన ముహూర్తం నిర్ణయించకపోతే ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే.. ఇప్పటి జనరేషన్ కు అటువంటి పట్టింపులు ఏమీ లేకుండా పెళ్ళికి ముందే తొందరపడతూ ఉంటారు. దీనివలన సత్సంతానం కలగడం లేదని బాధపడుతున్నారు. ఇందుకు ఒక ఉదాహరణ హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడి జననం. అందుకే మంచి ముహూర్తం చూసి బృహస్పతి ఐదో స్థానంలో ఉన్నప్పుడు శుభముహూర్తం నిర్ణయిస్తారు. ఎందుకంటే పంచమం ప్రేమ స్థానంగా చెబుతారు. ఆ సమయంలో అదానము అంటే ఉంచడం, గర్భాదానం అంటే గర్భంలో ఉంచడం అని అర్థం.