Buddha Statue: వాస్తు ప్రకారం మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధను అక్కడ ఉంచితే చాలు.. డబ్బే డబ్బు?

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పిన విధంగా ప్రతి ఒక్

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 09:22 PM IST

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పిన విధంగా ప్రతి ఒక్క విషయంలో వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. ఈ విధంగా వాస్తు శాస్త్రము నమ్మి వాస్తు చిట్కాలను పాటించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. చాలామంది ఇంట్లో లాఫింగ్ బుద్ధుని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ లాఫింగ్ బుద్ధను ఏర్పాటు చేయడానికి సరైన స్థానం, సరైన దిక్కు ఏంటి ఈ విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేర్వేరు రకాలలో ఉండే బుద్ధుని భంగిమలు వేర్వురు రకాల ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం, సంపద, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటారు.

లాఫింగ్ బుద్ధను సానుకూల ప్రభావాలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే చాలా మంది తమ ఇళ్లలో లాఫింగ్ బుద్ధను తమ ఇళ్లలో ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని భావిస్తారు. అయితే మీ ఇంట్లో ఈ దిశలలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచితే మీకు సరైన శక్తి ఉత్పత్తి చేయడంతో పాటు మీ సంపదర పెరుగుతుందట. ఇంటి ప్రధాన ముఖద్వారం వద్ద లాఫింగ్ బద్ధుని విగ్రహాన్ని ఉంచాలి. అది మీకు కంటికి కనబడేలా తక్కువ ఎత్తులా ఉండేలా చూసుకోవాలి. అయితే మీరు బుద్ధుని విగ్రహాన్ని ఎత్తైన ప్రదేశంలో ఎప్పటికీ ఉంచకూడదట. అలాగే పైనుండి ఎప్పుడూ చూడకూడదు. సంపద శ్రేయస్సును ఆకర్షించడానికి మీరు విగ్రహాన్ని ఇంట్లోని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచేలా చూసుకోవాలి. బుద్ధుని విగ్రహాన్ని మీ ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా నేలపై ఉంచకూడదు.

భూమి నుండి కనీసం నాలుగైదు అడుగుల పైన ఉంచాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఒత్తిడిని తగ్గించుకునేందుకు బుద్ధుడిని ప్రార్థన గదిలో ఉంచి ద్యానించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. మీ ఇంట్లోని ప్రవేశ ద్వారం వద్ద బుద్ధుడు ఆశీర్వాద భంగిమలో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి బుద్ధుని విగ్రహం ఉంచడం వల్ల వ్యతిరేక శక్తులు అన్నీ ఇంటి నుండే బయట ఉండిపోతాయి. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం బుద్ధుడిని పడమర వైపు దిశ వైపు చూస్తున్నట్టుగా గదిలో కుడివైపుగా ఉంచితే మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీకు సాయంత్రం వేళ తోటలో లేదా పార్కుల్లో నడిచే అలవాటు ఉంటే అక్కడ ఒక పరి శుభ్రమైన ప్లేసులో ద్యానం చేస్తున్న బుద్ధుడిని ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ బుద్ధుని విగ్రహం చుట్టూ దీపాలను వెలిగిస్తే, మీకు ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుందట.