హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు, తులసి కోటకు, తులసి మాలకు చాలా ప్రాధాన్యత ఉంది. తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే తులసి చెట్టుకు పూజ చేయడంతో పాటు, తులసి కోటకు కూడా మొక్కులు చెల్లిస్తుంటారు. అలాగే చాలా మంది తులసి మాలను కూడా ధరిస్తారు. అయితే చాలామందికీ తులసి మాలను ధరించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయం తెలియదు. అయినా కూడా తులసిమాలను ధరిస్తూ ఉంటారు.
మరి తులసి మాలను ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి మొక్కను దేవతలకు సంభంధించిన మొక్కగా భావిస్తారు. అందుకే ఈ మొక్కను అనేక పవిత్ర అనుబంధాలతో కలుపుతారు. అయితే తులసి మాల ధరిస్తే దేవుని కృప పొందవచ్చట. అలాగే తులసి మాలను ధరిస్తే ఆధ్యాత్మిక శాంతిని కూడా పొందవచ్చని, ఇది మనసును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే మనిషి చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుందట. తులసి మొక్కను శ్రీవిష్ణువుకు ప్రియమైన మొక్కగా పరిగణిస్తారు.
ఈ మాల ధరిస్తే విష్ణు కృప కూడా మీపై కలుగుతుందట. తులసి మాల ధరిస్తే శరీరంలో తులసి ఔషధ గుణాలు ప్రభావితం అవుతాయట. ఇది శరీరంలోని టాక్సిన్లు తొలగించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడానికి సహాయపడుతుందట. తులసి అనేది ప్రాకృతిక మందుగా పరిగణించబడుతుందట. ఇది ఆస్తమా, జలుబు, జ్వరం, అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే తులసి మాల ధరించడం మనసును ప్రశాంతంగా ఉంటుందట. ఇది కలుషిత ధోరణులను తగ్గించి, అధిక ఆందోళన లేదా ఒత్తిడి వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందట. తులసి మాల ధరిస్తే, అది మనసులో సానుకూల ఆలోచనలను ప్రేరేపిస్తుందట. అలాగే నెగిటివ్ భావాలను తొలగిస్తుందట. కాబట్టి ఈ తులసి మాలను ధరించడం వల్ల మనం అనుకున్న పనులు కూడా నెరవేరుతాయట.